Ganja Seized : కోదాడలో 36 కిలోల గంజాయి స్వాధీనం, ఇద్దరు అరెస్ట్

సూర్యాపేట జిల్లా కోదాడలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న దంపతులను అరెస్ట్ చేయగా వారి వద్ద 36 కిలోల గంజాయి లభించింది.

Ganja Seized : కోదాడలో 36 కిలోల గంజాయి స్వాధీనం, ఇద్దరు అరెస్ట్

Ganja Seized

Ganja Seized :  సూర్యాపేట జిల్లా కోదాడలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న దంపతులను అరెస్ట్ చేయగా వారి వద్ద 36 కిలోల గంజాయి లభించింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

జ్యోత్స్న, సూరత్ శెట్టి అనే ఇద్దరు ప్రేమించుకున్నారు. జ్యోత్స్న ఇంట్లో వీరి వివాహానికి ఒప్పుకోకపోవటంతో ఇద్దరూ పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొన్నాళ్లకు సూరత్ శెట్టికి ప్రమాదం జరిగి పని చేయలేని స్ధితిలోఉన్నాడు. ఈ సమయంలో ఇల్లు గడవటానికి ఈ దంపతులు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు.  నిషేధిత గంజాయి అమ్మాలని  నిర్ణయించుకున్నారు.

ఇద్దరూ కలిసి ఈనెల 13న  భువనేశ్వర్ వెళ్లి అక్కడ గుర్తు  తెలియని వ్యక్తుల వద్దనుంచి తక్కువ ధరకు గంజాయి కొనుక్కుని…. హైదరాబాద్ మీదుగా ముంబై వెళ్లేందుకు బస్సులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద పోలీసులు బస్సులను తనిఖీ చేస్తుండగా వీరిద్దరూ అనుమానాస్పదంగా ప్రవర్తించసాగారు.

దీంతో పోలీసులు వారిని తనిఖీ చేయగా వారి వద్ద 36 కేజీల గంజాయి లభించింది. బహిరంగ మార్కెట్ లో దీని విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుల వద్దనుంచి ఒక సెల్ ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read : karate Kalyani : కొత్త వివాదంలో కరాటే కళ్యాణి