Hyderabad : వీధికుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి

పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బాలుడిని నీలోఫర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Hyderabad : వీధికుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి

Boy Kill

street dogs attack : హైదరాబాద్ లో విషాదం నెలకొంది. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందాడు. గోల్కొండ పరిధిలోని బడా బజార్ లో బాలుడు అనస్ అహ్మద్ (2)పై వీధికుక్కలు దాడి చేశాయి. ఇంటి బటయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిసై ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి.

మెడ, గొంతు, పొట్ట, కాలు భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చిన్నారిని హుటాహుటినా సమీపంలోని గోల్కొండ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Bhopal Girl: చిన్నారిపై కుక్కల దాడి.. మానవ హక్కుల కమిషన్ నోటీసులు

పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బాలుడిని నీలోఫర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

బాలుడి తాతయ్య మిర్జా
‘సెవెన్ గల్లిలో వీధి కుక్కలు నా మనవణిపై దాడి చేశాయి. వెంటనే గోల్కొండ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాము. అక్కడి నుండి వైద్య సిబ్బంది నిలోఫర్ కు తరలించారు. నిలోఫర్ ఆసుపత్రి లో నా మనువడు మృతి చెందాడు. ఇది వరకు కూడా బడ బజార్ సెవెన్ గల్లీలో ఇద్దరిపై కుక్కలు దాడికి పాల్పడ్డాయి. వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని.. గతంలో జిహెచ్ఎంసి వారికి ఎన్నో సార్లు ఫిర్యాదు చేశాము, విన్నవించాము.

Hyderabad : హైదరాబాద్ లో దారుణం : కుక్కనోట్లో బాలుడి తల

నిన్న రాత్రి నా మనువడు అదుకుంటుంటుడగా వీధి కుక్కలు దాడి చేశాయి. సెవెన్ గల్లి లో మా ఇంటి పక్క వీధిలోనే నూతన ఇల్లు నిర్మాణం జరుగుతుంది. వీధి కుక్కలు ఆ భవనంలో ఉంటున్నాయి. రాత్రివేళల్లో వచ్చి దాడికి పాల్పడ్డాయి. సెవెన్ హిల్స్ కాలనీలో నిర్మాణంలో ఉన్న నూతన భవనానికి బౌండరీ గోడ ఉంటే కుక్కలు కాలనీలోకి రాకుండా ఉండేవి.

జిహెచ్ఎంసి వారు ఉదయం పూట వచ్చి వెళ్తున్నారు. వీధి కుక్కలు రాత్రి 10 తర్వాత అర్ధరాత్రి వేళలో సెవెన్ హిల్స్ కాలనీలో స్వైరవిహారం చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిహెచ్ఎంసి & ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.