Missing Case: టెర్రస్‌పై ఆడుకునేందుకు వెళ్లిన అక్కాతమ్ముళ్లు అదృశ్యమైన వైనం
మేడపై ఆడుకుంటున్న ఓ బాలిక (15), ఆమె తమ్ముడు (10) ఒకేసారి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. ఆ బాలిక, బాలుడు కలిసి ఆడుకుంటున్నారని భావించిన కుటుంబ సభ్యులు వారు కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని దేవబంద్ ప్రాంతంలోని సంప్లా బకల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన అక్కాతమ్ముళ్ల గురించి పోలీసులు గాలిస్తున్నారు.

four 10th Class Girl Missing in Visakha
Missing Case: మేడపై ఆడుకుంటున్న ఓ బాలిక (15), ఆమె తమ్ముడు (10) ఒకేసారి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. ఆ బాలిక, బాలుడు కలిసి ఆడుకుంటున్నారని భావించిన కుటుంబ సభ్యులు వారు కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని దేవబంద్ ప్రాంతంలోని సంప్లా బకల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన అక్కాతమ్ముళ్ల గురించి పోలీసులు గాలిస్తున్నారు.
అక్క పేరు ముస్కాన్ అని, ఆమె తమ్ముడి పేరు సమద్ అని పోలీసులు వివరించారు. వారిద్దరు తమ ఇంటి టెర్రస్ పైకి ఆడుకోవడానికి వెళ్లారని చెప్పారు. అనంతరం, వారు ఎంతసేపయినా ఇంట్లోకి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు వారి కోసం టెర్రస్ పైకి ఎక్కి చూశారు. అయితే, వారు అక్కడ లేరు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకుండా పోయింది.
దీంతో ముస్కాన్, సమద్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని ఆ ప్రాంత రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సూరజ్ రాజ్ చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ఆ అక్కాతమ్ముళ్ల తండ్రి సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడని వివరించారు.
UP 1st Govt Bbus Women Driver : యూపీలో తొలి మహిళా బస్సు డ్రైవర్ ‘ప్రియాంక శర్మ’