Uttar Pradesh : కన్న కొడుకును హత్య చేసిన తల్లి .. సినిమా స్టైల్లో ప్రతీకారం తీర్చుకున్న తండ్రి

నేరాలకు అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్ జరిగిన ఓ హత్య విషయంలో తండ్రి సినిమా స్టైల్లో ప్రతీకారం తీర్చుకున్న ఘటన ఆసక్తికరంగా మారింది. సినిమాల్లో కూడా లేనన్ని ట్విస్టులు ఈ కేసులో ఉన్నాయి.

Uttar Pradesh : కన్న కొడుకును హత్య చేసిన తల్లి .. సినిమా స్టైల్లో ప్రతీకారం తీర్చుకున్న తండ్రి

Uttar Pradesh

Uttar Pradesh : నేరాలకు అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్ జరిగిన ఓ హత్య విషయంలో తండ్రి సినిమా స్టైల్లో ప్రతీకారం తీర్చుకున్న ఘటన ఆసక్తికరంగా మారింది. సినిమాల్లో కూడా లేనన్ని ట్విస్టులు ఈ కేసులో ఉన్నాయి. కన్నతల్లే కొడుకుని హత్య చేయటమే ఓ దారుణం అనుకుంటే కొడుకుని చంపటంలో భార్యకు సహకరించిన వ్యక్తిని కాల్చి చంపిన తండ్రి పక్కా ప్లాన్ మామూలుగా లేదు. 50 ఏళ్ల వ్యక్తి పక్కా ప్లాన్ తో కన్నకొడుకు హత్యకు ప్రతీకారం తీర్చుకున్న ఘటన యూపీలోని ఖేరీ జిల్లాలో చోటుచేసుకుంది..

ఖేరీ జిల్లాలోని మితౌలీ ప్రాంతంలో కాశీ కశ్యప్ అనే 50 ఏళ్ల వ్యక్తి తన భార్య కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. ఈక్రమంలో ఖేరీ జిల్లాలో ఓ వివాదంపై 2020లో జరిగిన హత్య కేసులో కాశీ కశ్యప్ నిందితుడుగా ఉన్నాడు. ఈ కేసు విచారణలో భాగంగా కాశీ జైలుకు వెళ్లాడు. దీంతో కాశీ భార్య తన 14 కుమారుడు జితేంద్రలను అత్తమామల ఇంటికి పంపించాడు. ఆ తరువాత జితేంద్ర 2021లో కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత జితేంద్ర మృతదేహం నది ఒడ్డున గుర్తించారు. అతను ఎలా చనిపోయాడనే విషయం కొన్ని రోజుల వరకు ఎవరికీ తెలియరాలేదు. కొడుకు చనిపోయాడని తెలిసిన కాశీ తల్లడిల్లిపోయాడు.

2021లో కాశీ కశ్యప్ భార్య…శత్రుధన్ లాలా అనే తన సమీప బంధువులైన 47 ఏళ్ల వ్యక్తితో కలిసి తన కన్నకొడుకును హత్య చేసింది. లాలా సహాయంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం పోలీసులకు ఎలా తెలిసిందంటే..కాశీ భార్యకు లాలాకు మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో కాశీ భార్య కోర్టుకెక్కింది. దీనిపై విచారణ జరపాలని కోర్టు ఆదేశించటంతో విచారణ ప్రారంభించిన పోలీసులు షాక్ అయ్యారు.వారి దర్యాప్తులో జితేంద్రను కాశీభార్య, లాలా కలిసి చంపారని తెలిసింది. జితేంద్ర హత్య చేసిన ఆరోపణలతో కశ్యప్ భార్యను, లాలాను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆ తరువాత డిసెంబర్ 2022లో కాశీ కశ్యప్ జైలు నుండి విడుదలయ్యాడు. అప్పటికే తన కొడుకుని చంపిన భార్య, లాలా జైలులో ఉన్నారు. దీంతో వారికి జైలులో ఉంటే సరిపోదని వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.

దీని కోసం పక్కా ప్లాన్ వేశాడు. తనే స్వయంగా న్యాయవాదిని నియమించి లాలాకు బెయిల్ వచ్చేలా చేశాడు.2023 ఏప్రిల్ మొదటి వారంలో లాలాకు బెయిల్ వచ్చింది. ఆ తర్వాత లాలా కదలికలను కాశీ కన్నేసి ఉంచాడు. ఏం చస్తున్నాడు? ఏఏ సమయాల్లో ఎక్కడికెళుతున్నాడో బాగా గమనించాడు. గత శుక్రవారం సాయంత్రం (మే5,2023) లాలా పొలం నుండి ఇంటికి వెళ్తుండగా కాశీ కశ్యప్ అతనిని కాల్చి చంపాడు. లాలా తలపై కాశీ కశ్యప్‌ మూడుసార్లు కాల్పులు జరపడంతో 47 ఏళ్ల లాలా అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో పోలీసులు కాశీని అరెస్ట్ చేశారు. కాశీకి వ్యతిరేకంగా పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. కానీ కాశీ కోసం గాలిస్తున్నామని ఎస్పీ నైపాల్ సింగ్ తెలిపారు.