Extra-Marital Affair : వేరే మహిళతో వివాహేతర సంబంధం..భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసిన భార్య

వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. వరంగల్ పైడిపల్లి ఆర్టీసీ కాలనీలో భర్తపై భార్య కుటుంబసభ్యులు దాడి చేశారు. పైడిపల్లిలో ఆ మహిళతో కలిసి ఆమె ఇంట్లో ఉన్న జీవన్‌కుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Extra-Marital Affair : వేరే మహిళతో వివాహేతర సంబంధం..భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసిన భార్య

extra-marital affair

Extra-Marital Affair : వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. వరంగల్ పైడిపల్లి ఆర్టీసీ కాలనీలో భర్తపై భార్య కుటుంబసభ్యులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. GWMCలో పని చేస్తున్న ఓ మహిళ అదే కార్పొరేషన్‌లో పనిచేసి సస్పెండ్ అయిన జీవన్ కుమార్ మధ్య వివాహేతర సంబంధముంది.

జీవన్ కుమార్‌కు వరంగల్‌కు చెందిన ఓ యువతితో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి ఆమెను తరుచూ వేధిస్తున్నాడు. ఇంటికి కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చేవాడు.

Extra-Marital Relationship Suicide : ఇద్దరి ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం

అనుమానం వచ్చిన భార్య కుటుంబ సభ్యులు అతనిపై ఆరా తీయగా వివాహేతర సంబంధముందని అర్థమైంది. పైడిపల్లిలో ఆ మహిళతో కలిసి ఆమె ఇంట్లో ఉన్న జీవన్‌కుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.