Police Constable : పోలీసు ఉద్యోగానికి ఎంపికైన యువతి-బంగారం చోరీ కేసులో అరెస్ట్

రేపో..మాపో పోలీసు కానిస్టేబుల్ అయి దొంగలను పట్టుకోవాల్సిన అభ్యర్ధి ... దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది. అంతకంటే దురదృష్టం ఇంకొకటి ఉండదు. రాష్ట్ర పోలీస్‌ పరీక్షలో ప్రతిభ చూపి.... పోలీసుగ

Police Constable : పోలీసు ఉద్యోగానికి ఎంపికైన యువతి-బంగారం చోరీ కేసులో అరెస్ట్

Puducherry police constable

Police Constable  : రేపో..మాపో పోలీసు కానిస్టేబుల్ అయి దొంగలను పట్టుకోవాల్సిన అభ్యర్ధి … దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది. అంతకంటే దురదృష్టం ఇంకొకటి ఉండదు. రాష్ట్ర పోలీస్‌ పరీక్షలో ప్రతిభ చూపి…. పోలీసుగా బాధ్యతలు తీసుకోకుండానే ఒక యువతి 12 సవర్ల బంగారం చోరీ కేసులో అరెస్ట్ అయిన ఘటన పాండిచ్చేరిలో చోటు చేసుకుంది.

విల్లుపురం జిల్లా సెంజి అలంపూడికి చెందిన మాధవి(42) అనే మహిళ పుదుచ్చేరి కనక శెట్టి కులంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో డాక్టర్‌గా ఉద్యోగం చేస్తోంది. పుదువై కుళవర్‌ పాలయం పట్టిలోని ఓ ప్రైవేటు లేడీస్‌ హాస్టల్లో ఉంటుూ విధులకు హాజరవుతోంది. ఈనెల 18న బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి తన హాస్టల్ గదికి వచ్చారు.

పెళ్ళికి పెట్టుకుని వెళ్లిన 12 సవర్ల బంగారు ఆభరణాలను గదిలో పెట్టి ఆమె తన విధులకు హాజరయ్యారు. డాక్టర్‌గా విధులు ముగించుకుని తన హాస్టల్ గదికి వచ్చి చూసేసరికి నగలు కనపడకపోవటంతో ఉరులియన్ పేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా మాధవి పక్క గదిలో నివసిస్తున్న శివప్రతిక అనే యువతిని కూడా పోలీసులు విచారించారు.

విచారణలో తానే నగలను చోరీ చేసినట్లు ఆ యువతి పోలీసులకు తెలిపింది. కాగా నిందితురాలు ఇటీవల నిర్వహించిన రాష్ట్ర పోలీసు పరీక్షలో ప్రతిభ చూపి ఉద్యోగానికి ఎంపికయ్యింది. మరోక వారం రోజుల్లో మార్చి 1 వ తేదీ నుంచి ఆమె విధుల్లో చేరాల్సి ఉంది. ఇంతలో ఆమె ఈ చోరీకి పాల్పడింది.

కాగా…. ఆమె ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి బయటకు వచ్చి మహిళా హాస్టల్లో ఉంటోందని పోలీసులు తెలుసుకున్నారు. చోరీ చేసిన నగలలో కొన్నిటిని అమ్మి ప్రియుడితో కలిసి ఆమె జల్సా చేసినట్లు తెలిపింది. వారం రోజుల్లో పోలీసు డ్రస్ వేసుకోవాల్సిన యువతి నేరస్ధురాలుగా అరెస్టవటం ఇప్పడు చర్చనీయాంశమైంది.