వ్యాపారవేత్తను బ్లాక్ మెయిల్ చేసిన కేసులో తల్లీ, కొడుకు అరెస్ట్

కర్ణాటక రాష్ట్రంలో వ్యాపార వేత్తను బ్లాక్ మెయిల్ చేసి 15 లక్షలు వసూలు చేసిన కేసులో ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.

వ్యాపారవేత్తను బ్లాక్ మెయిల్ చేసిన కేసులో తల్లీ, కొడుకు అరెస్ట్

woman black main a businessman in karnataka : కర్ణాటక రాష్ట్రంలో వ్యాపార వేత్తను బ్లాక్ మెయిల్ చేసి 15 లక్షలు వసూలు చేసిన కేసులో ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. కొప్పళ్ లో ఒక స్టీల్ ఫ్యాక్టరీ నిర్వహించే సుబ్బారెడ్డి అనే వ్యాపార వేత్త .. హోస్పేటలోని ఎంజే నగర్ 6వ క్రాస్ రోడ్ లో ఆఫీసు ఏర్పాటు చేసుకున్నాడు. అతని కార్యాలయం ఎదురు ఇంటిలో గీత అనే మహిళ తన కుమారుడితో నివసిస్తోంది.

2019 మార్చిలోగీతకు, సుబ్బారెడ్డికి పరిచయం ఏర్పడింది. ఒకరోజు గీత అయన్ను తన ఇంటికి ఆహ్వానించి టీ ఇచ్చింది. అది తాగిన సుబ్బారెడ్డి స్పృహ కోల్పోయాడు. గంట తర్వాత తేరుకుని ఇంటికి వెళ్లిపోయాడు. రెండురోజుల తర్వాత గీత ఫోన్ చేసి నీ నగ్న వీడియోలు నా దగ్గర ఉన్నాయని, రూ.30 లక్షలు ఇచ్చి సీడీ తీసుకు వెళ్లాలని సూచించింది.

దీంతో సుబ్బారెడ్డి భయపడి గీత బ్యాంక్ ఎకౌంట్ కు 15 లక్షల రూపాయలు ట్రాన్సఫర్ చేశాడు. మిగతా డబ్బుకోసం ఇటీవల గీత మళ్లీ వత్తిడి చేయగా సుబ్బారెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు గీత ఇంట్లో తనిఖీలు నిర్వహించగా..2,750 గ్రాముల గంజాయి లభించింది. గీతతో పాటు ఆమెకు సహకరించిన కుమారుడు విష్ణును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు టీడీడ్యాం సీఐ నారాయణ తెలిపారు.