Extra Marital Affair : అక్రమ సంబంధం తెలిసిందని..ప్రియుడితో కలిసి మామను చంపిన కోడలు
తన అక్రమ సంబంధం విషయం మామకు తెలిసి... అందరికీ చెప్తాననే సరికి భయపడిన కోడలు ప్రియుడితో కలిసి మామను హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.

Murder Nalgonda
Extra Marital Affair : తన అక్రమ సంబంధం విషయం మామకు తెలిసి… అందరికీ చెప్తాననే సరికి భయపడిన కోడలు ప్రియుడితో కలిసి మామను హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామానికి చెందిన శ్యామల ముత్తయ్య (60) అనే వ్యక్తి బాతుల పెంపకం నిర్వహిస్తుంటాడు. అతనికి భార్య ఇద్దరు కుమార్తెలు, కొడుకు, కోడలు ఉన్నారు.
బాతులను మేపేందుకు వారం రోజుల క్రితం శాలిగౌరారం మండలంలోని మాధారంకలాన్ గ్రామానికి కుటుంబ సమేతంగా వచ్చి, ఊరి చివర చెరువు కట్ట వద్ద తాత్కాలికంగా గుడిసె వేసుకుని ఉంటున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ లో ఉంటున్న ముత్తయ్య పెద్ద కుమార్తె కూతురుకు నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమం ఉండటంతో ముత్తయ్య కొడుకు నర్సింహ శనివారం కరీంనగర్ వెళ్లాడు.
Read Also : Accused Suicide : తూప్రాన్ కారు దగ్ధం, వ్యాపారి హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య
ముత్తయ్య కోడలు శైలజ తన అన్నకు బావమరిది వరసయ్యే నేరేడచర్లకు చెందిన బాతుల పెంపకం దారు మహేష్ తో కొంత కాలంగా సన్నిహితంగా ఉంటోంది. శైలజ భర్త నర్సింహ ఇంట్లో లేడని తెలుసుకున్న మహేష్ శనివారం రాత్రి శైలజ ఉంటున్న గుడిసె వద్దకు వచ్చాడు. అంతకు ముందు బీడీల కోసం మాధారం కలాన్ వెళ్లిన శైలజ మామ ముత్తయ్య గుడిసె వద్దకు తిరిగి వచ్చే సరికి శైలజ, మహేష్ లు సన్నిహితంగా ఉండటం చూసాడు.
కోపోద్రిక్తుడైన ముత్తయ్య కోడలు శైలజ, ఆమె ప్రియుడు మహేష్ లను తిడుతూ ఈ విషయం ఆదివారం ఉదయం అందరికీ చెపుతానని హెచ్చరించాడు. తెల్లారితే పరువు బజారు పడతుందని… తమ అక్రమ సంబంధం అందరికీ తెలిసి పోతుందని భయపడిన శైలజ ఆమె ప్రియుడూ ఇద్దరూ కలిసి ముత్తయ్యపై దాడి చేశారు. కింద పడిపోయిన ముత్తయ్య ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపారు. ముత్తయ్య మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత మహేష్ అక్కడి నుంచి పరారయ్యాడు.
Read Also : Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది ఏపీ కూలీలు మృతి!
శైలజ ఏమీ తెలియనట్లు పిల్లలతో కలిసి గుడిసెలో ఆ రోజు రాత్రి నిద్రించింది. ఆదివారం తెల్లవారు ఝూమున కరీంనగర్ లో ఉన్న భర్త నర్సింహకు ఫోన్ చేసి మామ ముత్తయ్య గుండెపోటుతో మరణించాడని చెప్పింది. ఆదివారం సాయంత్రానికి నర్సింహ మాధారం కలాన్ చేరుకున్నాడు. తండ్రి ముత్తయ్య శరీరంపై,ముఖంపై గాయాలు ఉండటంతో…. భార్యపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హతుడి కోడలు శైలజను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మహేష్ కోసం గాలింపు చేపట్టారు.