Young Girls Bike stunt : అమ్మాయిల బైక్ స్టంట్.. సరదా ఖరీదు రూ.28వేలు జరిమానా

ఇద్దరు యువతులు కూడా ఇలాంటి బైక్ స్టంట్ చేసి భారీ మూల్యం చెల్లించుకున్నారు. సరదా కోసం చేసిన వీడియోను ఇన్ స్టాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లింది. సదరు యువతికి భారీ ఫైన్ వేశారు.

Young Girls Bike stunt : అమ్మాయిల బైక్ స్టంట్.. సరదా ఖరీదు రూ.28వేలు జరిమానా

Young Girls Bike Stunt

Young Girls Bike stunt Fine : సరదా కోసం బైక్ స్టంట్ చేశారు.. ట్రాఫిక్ పోలీసులు రూ.28వేలు ఫైన్ వేశారు. సోషల్ మీడియా వచ్చాక ఏదొకటి సన్సేషన్ చేయడం కామన్ అయిపోయింది. సెల్ఫీ దిగడం లేదా స్టంట్ లు చేయడం ఇన్ స్టా, ఫేస్ బుక్ లలో పోస్టు చేయడం.. వైరల్ చేసేస్తున్నారు. కొన్సిసార్లు ఇలాంటి తుంటరి పనులతో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇద్దరు యువతులు కూడా ఇలాంటి బైక్ స్టంట్ చేసి భారీ మూల్యం చెల్లించుకున్నారు.

సరదా కోసం చేసిన వీడియోను ఇన్ స్టాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. అది కాస్తా ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లింది. అంతే.. బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు సదరు యువతికి భారీ ఫైన్ వేశారు. ట్రాఫిక్ ఉల్లంఘన కింద సుమోటోగా తీసుకున్న పోలీసులు రూ.28 వేలు జరిమానా విధించారు. ఈ ఘటన యూపీలోని ఘజియాబాద్ లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శివంగి దబాస్, రెజ్లర్ స్నేహ రఘువంషి ఇద్దరు స్నేహితులు.

ఘజియాబాద్‌ రోడ్డుపై స్నేహి రఘువంషి తన స్నేహితురాలు శివంగి దబాస్‌ను భుజాలపై కూర్చుబెట్టుకొని బైక్‌ రైడ్ చేసింది. బైక్‌ స్టంట్‌కు సంబంధించిన వీడియోను రఘువంషి తన ఇన్‌స్టాగ్రామ్‌లో‌ పోస్ట్ చేసింది. వీడియో వైరల్‌ అయి పోలీసుల కంటపడింది. రఘువంషి తల్లి మంజూ దేవికి రూ.11వేల చలానా పంపారు. బైక్‌ యజమాని సంజయ్‌ కుమార్‌కు రూ.17వేల ఫైన్‌ వేశారు.


ఈ ఇద్దరు యువతలకు డ్రైవింగ్‌ లైసన్స్‌ కూడా లేదని పోలీసులు వెల్లడించారు. డ్రైవింగ్‌ లైసన్స్‌ లేకుండా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్డుపై స్టంట్‌ చేసినందుకు ఫైన్ వేశామని ఘజియాబాద్‌ ట్రాఫిక్‌ ఎస్పీ రామానంద్ కుష్వాహా తెలిపారు.