Youth stabbed to death: 18 ఏళ్ల కుర్రాడిని ఘోరంగా పొడిచి చంపిన ఇద్దరు మైనర్లు

ఢిల్లీలోని మైదాన్ గర్హి ప్రాంతంలో పట్టపగలు కొందరు కుర్రాళ్లు రెచ్చిపోయారు. కత్తులతో పొడుచుకున్నారు. దీంతో 18 ఏళ్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు. రాధాకృష్ణ మందిర్ కు సమీపంలో రక్తపు మడుగులో ఓ యువకుడు విగత జీవిగా పడి ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లారని అధికారులు తెలిపారు.

Youth stabbed to death: 18 ఏళ్ల కుర్రాడిని ఘోరంగా పొడిచి చంపిన ఇద్దరు మైనర్లు

Crime news in hederabad

Updated On : January 22, 2023 / 3:20 PM IST

Youth stabbed to death: ఢిల్లీలోని మైదాన్ గర్హి ప్రాంతంలో పట్టపగలు కొందరు కుర్రాళ్లు రెచ్చిపోయారు. కత్తులతో పొడుచుకున్నారు. దీంతో 18 ఏళ్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు. రాధాకృష్ణ మందిర్ కు సమీపంలో రక్తపు మడుగులో ఓ యువకుడు విగత జీవిగా పడి ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లారని అధికారులు తెలిపారు.

ఆ మృతదేహంపై కత్తి కాట్లు, గొంతును కోసిన గాయాలు కనపడ్డాయని వివరించారు. మృతుడి పేరు హర్ష్ గా గుర్తించామని, అతడు భాతీ మైన్స్ లోని సంజయ్ కాలనీవాసి అని చెప్పారు. ఈ ఘటన ఐపీసీ 302 (హత్య) కింద కేసు నమోదుచేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

ఘటనాస్థలిలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించామని, దాని ఆధారంగా ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. ఆ ఇద్దరిలో ఓ మైనర్… బాధితుడు హర్ష్ నుంచి మొబైల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడని, అయితే, బాధితుడు ప్రతిఘటించాడని తెలిపారు. దీంతో మరో మైనర్ తో కలిసి నిందితుడు హర్ష్ ను పొడిచేశారని అన్నారు.

అనంతరం హర్ష్ గొంతు కోశారని వివరించారు. బాధితుడి మొబైల్ ఫోను, సిమ్ కార్డు, నిందితులు వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీనిపై తదుపరి విచారణ జరుపుతున్నామని చెప్పారు.

Woman Left Children : ముగ్గురు పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయిన వివాహిత