AICTE : విద్యార్థులకు శుభవార్త.. నెలకు రూ.12,400.. అర్హతలు, దరఖాస్తు విధానం..

విద్యార్థులకు సహకారం అందించేందుకు ఏఐసీటీఈ కొత్త స్కాలర్​షిప్​ను తీసుకొచ్చింది. ఏఐసీటీఈ ఆమోదించిన సంస్థలు లేదా యూనివర్సిటీల్లో పీజీ ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కు..

AICTE : విద్యార్థులకు శుభవార్త.. నెలకు రూ.12,400.. అర్హతలు, దరఖాస్తు విధానం..

Aicte Pg Scholarship

AICTE PG Scholarship : ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్య చదవలేకపోతున్న విద్యార్థులకు ఆల్​ ఇండియా సెంటర్​ ఫర్​ టెక్నికల్​ ఎడ్యుకేషన్​ (ఏఐసీటీఈ) గుడ్ న్యూస్ చెప్పింది. అలాంటి విద్యార్థులకు సహకారం అందించేందుకు ఏఐసీటీఈ కొత్త స్కాలర్​షిప్​ను తీసుకొచ్చింది. ఏఐసీటీఈ ఆమోదించిన సంస్థలు లేదా యూనివర్సిటీల్లో పీజీ ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కు అర్హులు.

Record Prices : వామ్మో.. సిలిండర్‌ ధర రూ.2వేల 657, కిలో పాలు రూ. 1,195.. భారీగా పెరిగిన ధరలు

* అర్హులైన విద్యార్థులకు ప్రతి నెల రూ.12,400 చొప్పున రెండేళ్ల పాటు స్కాలర్​షిప్​ ఇస్తారు.
* మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ఆఫ్ ఫార్మసీ, మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్​షిప్​ పొందేందుకు అర్హులు.
* అయితే వారు తప్పనిసరిగా గేట్(GATE), CEED లేదా GPAT క్వాలిఫై అయి​ ఉండాలి.

అర్హతలు, దరఖాస్తు విధానం..
* ఆన్‌లైన్ లో అప్లయ్ చేసుకోవాలి.
* గేట్, జీప్యాట్​ లేదా సీడ్​ అర్హత కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
* అభ్యర్థులు ఫుట్​ టైమ్​ రీసెర్చ్​ స్కాలర్​గా ప్రవేశం పొందాలి. పార్ట్​టైమ్​ విధానంలో పీజీ చేసే వారు దరఖాస్తుకు అనర్హులు.
* ఐదేళ్ల డ్యుయల్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌ చేస్తున్న విద్యార్థులు చివరి ఏడాది.. అంటే 9వ సెమిస్టర్ నుంచి స్కాలర్‌షిప్‌కు అర్హులు. అయితే వారు మునుపటి ఏడాదిలో 8 లేదా అంతకంటే ఎక్కువ CGPA స్కోరు సాధించి ఉండాలి.
* స్కాలర్‌షిప్ గరిష్టంగా 24 నెలల పాటు లేదా కోర్సు పూర్తయ్యే వరకు అందజేస్తారు.

ఏపీలో కరెంట్ కోతలు తప్పవ్.. ఎంత తక్కువ వాడితే అంత మంచిది

* ప్రతి పీజీ విద్యార్థి వారానికి 8 నుంచి 10 గంటలు వారి విద్యాసంస్థ సూచించిన మేరకు టీచింగ్, రీసెర్చ్ కార్యకలాపాల్లో పాల్గొనాలి.
* పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్​కు దరఖాస్తు చేయడానికి ఆధార్ నంబర్ తప్పనిసరి.
* విదేశీ విద్యార్థులు, స్పాన్సర్డ్​ అభ్యర్థులు, మేనేజ్‌మెంట్ కోటా ద్వారా ప్రవేశాలు పొందిన వారు స్కాలర్‌షిప్‌కు అనర్హులు.
* ఏఐసీటీఈ అధికారిక వెబ్‌సైట్ ( https://www.aicte-india.org/schemes/students-development-schemes/PG-Scholarship-Scheme) ద్వారా అప్లయ్ చేసుకోవాలి.
* విద్యార్థులు ఐడీ క్రియేట్ చేసుకోవడానికి, దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2021.
* జనవరి 14, 2022న దరఖాస్తుల వెరిఫికేషన్ ఉంటుంది.
* ఆన్ లైన్ పోర్టల్ లో అప్లికేషన్ వచ్చిన వెంటనే వెరిఫై చేయాలని ఇన్ స్టిట్యూషన్స్ కు ఏఐసీటీఐ సూచించింది.
* దేశంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ ను అభివృద్ది చేసేందుకు ఈ స్కాలర్ షిప్స్ ఇస్తున్నారు.