ఏపీ పదోతరగతి సప్లిమెంటరీ టైమ్ టేబుల్ విడుదల

  • Published By: veegamteam ,Published On : May 15, 2019 / 04:55 AM IST
ఏపీ పదోతరగతి సప్లిమెంటరీ టైమ్ టేబుల్ విడుదల

ఏపీలో పదోతరగతి ఫలితాలను మంగళవారం (మే 14, 2019)న విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 17 నుంచి 29 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. షెడ్యూలు ప్రకారం విద్యార్థులకు జూన్ 17 నుంచి 29 వరకు తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు జూన్ 6లోగా సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జూన్ 7లోగా ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.  

రెండు రోజుల్లో విద్యార్థులు మార్కుల మెమోలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆమె తెలిపారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం మే 30 లోపు దరఖాస్తు కోవాల్సి ఉంటుంది. రీవెరిఫికేషన్, జవాబు పత్రం జిరాక్స్ కాపీలు పొందడానికి ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రీకౌంటింగ్ కోసం రూ.500 చెల్లించాలి. అలాాగే సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి మూడు సబ్జెక్ట్‌ల లోపు ఉన్నవారు రూ.110, మూడు సబ్జెక్ట్‌ల పైనా రాసేవారు రూ.125 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.