APDME JOBS : ఏపిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్న ఏపిడిఎమ్ఈ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 52 సంవత్సరాలకు మించరాదు. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఎంబీబీఎస్, పీజీ మెడికల్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాత పరీక్ష , ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

APDME JOBS : ఏపిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్న ఏపిడిఎమ్ఈ

Apdme

APDME JOBS : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో పనిచేస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 149 ఉండగా అర్హులైన, ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ ఖాళీలు 81, ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం 68 ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 52 సంవత్సరాలకు మించరాదు. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఎంబీబీఎస్, పీజీ మెడికల్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాత పరీక్ష , ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్ధులు 1500రూ, ఎస్సీ,ఎస్టీ అభ్యర్ధులు 1,000రూ చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు పక్రియ మే 23, 2022 నుండి ప్రారంభం కానుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://dme.ap.nic.in/పరిశీలించగలరు.