AAI Recruitment : ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లో ఒప్పంద ఖాళీల భర్తీ

ఇంటర్వ్యూలో ప్రతిభకనబరచిన అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.31,000ల నుంచి రూ.1,10,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అలాగే ఎంపికైన వారు రాయ్‌పూర్‌ ఎయిర్‌ఫోర్టులో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

AAI Recruitment : ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లో ఒప్పంద ఖాళీల భర్తీ

Airports Authority of India

AAI Recruitment : భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) లో ఒప్పంద ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 సెక్యురిటీ స్క్రీనర్‌ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Coconut Oil Vs Olive Oil : కొబ్బరి నూనె , ఆలివ్ ఆయిల్ ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరమైనది?

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. బీసీఏఎస్ బేసిక్‌ సర్టిఫికెట్, బీసీఏఎస్ స్క్రీనర్ సర్టిఫికెట్ ఉండాలి. హిందీ,ఇంగ్లిష్‌తోపాటు స్థానిక భాషలో మాట్లాడటం, రాయడం రావాలి. అభ్యర్ధుల వయసు 50 ఏళ్లకు మించకుండా ఉండాలి.

READ ALSO : Murrel Fish Seed Production : నూతన టెక్నాలజీలో.. కొర్రమేను పిల్లల ఉత్పత్తి

ఇంటర్వ్యూలో ప్రతిభకనబరచిన అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.31,000ల నుంచి రూ.1,10,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అలాగే ఎంపికైన వారు రాయ్‌పూర్‌ ఎయిర్‌ఫోర్టులో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

READ ALSO : Burn Belly Fat Naturally : బెల్లీ ఫ్యాట్‌ను వేగంగా కరిగించే మూలికలు ఇవే ?

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో జూన్‌ 12, 2023వ తేదీన ఉదయం 10 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన చిరునామా ; కాన్ఫరెన్స్ హాల్, 1వ అంతస్తు, AAI, ఓల్డ్ టెర్మినల్ బిల్డింగ్, S.V. విమానాశ్రయం, రాయ్‌పూర్-492015. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.aai.aero/పరిశీలించగలరు.