Outsourcing Govt Jobs : కాకినాడలోని జిల్లా వైద్యారోగ్యశాఖలో ఒప్పంద, అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఖాళీల భర్తీ

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎంబీబీఎస్‌, పీజీ, డిప్లొమా, బీడీఎస్‌, ఎంఫిల్‌, ఎంఎస్సీ, నర్సింగ్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 42 ఏళ్లకు మించకూడదు.

Outsourcing Govt Jobs : కాకినాడలోని జిల్లా వైద్యారోగ్యశాఖలో ఒప్పంద, అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఖాళీల భర్తీ

Outsourcing Govt Jobs in Kakinada

Outsourcing Govt Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కాకినాడలోని జిల్లా వైద్యారోగ్య కార్యాలయం పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఒప్పంద/ అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 152 మెడికల్, పారా మెడికల్ పోస్టుల భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.

ఖాళీల వివరాలకు సంబంధించి పీడియాట్రిషియన్ పోస్టులు: 10, గైనకాలజిస్టు పోస్టులు: 5, ఫిజిషియన్/ కన్సల్టెంట్ మెడిసిన్ పోస్టులు: 2, మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 48, మెడికల్ ఆఫీసర్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు: 3, క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులు: 2, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు: 1, ట్యూబర్‌క్యులోసిస్ హెల్త్‌ విజిటర్‌ పోస్టులు: 2, సీనియర్ ట్యూబర్‌క్యులోసిస్ ల్యాబొరేటరీ పోస్టులు: 3, స్టాటిస్టికల్ అసిస్టెంట్ పోస్టులు: 1, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 10, సపోర్టింగ్ స్టాఫ్/ సెక్యూరిటీ పోస్టులు: 2, న్యూట్రిషన్ కౌన్సెలర్ పోస్టులు: 1

అలాగే స్టాఫ్ నర్సు పోస్టులు: 39, కుక్ కమ్ కేర్‌టేకర్ పోస్టులు: 1, వార్డు క్లీనర్ పోస్టులు: 4, ఫిజియోథెరపిస్ట్ పోస్టులు: 2, సోషల్ వర్కర్ పోస్టులు: 3, డెంటల్ టెక్నీషియన్ పోస్టులు: 2, ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు: 3, ఆప్టోమెట్రిస్ట్ పోస్టులు: 1, హాస్పిటల్ అటెండెంట్ పోస్టులు: 2, శానిటరీ అటెండెంట్ పోస్టులు: 1, ఆడియో మెట్రికేషన్ పోస్టులు: 3, మేనేజర్ – క్యుఏ పోస్టులు: 1 ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎంబీబీఎస్‌, పీజీ, డిప్లొమా, బీడీఎస్‌, ఎంఫిల్‌, ఎంఎస్సీ, నర్సింగ్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 42 ఏళ్లకు మించకూడదు.

విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన వారు జనవరి 12, 2023వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; District Medical and Health Officer, EG Kakinada, AP. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://eastgodavari.ap.gov.in/ పరిశీలించగలరు.