UPSC : ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితం..వారికి మాత్రమే

ఆర్టీసీ బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు. హాల్ టికెట్ చూపించి బస్సుల్లో ఫ్రీగానే...వెళ్లవచ్చని తెలిపారు.

UPSC : ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితం..వారికి మాత్రమే

Tsrtc

UPSC Civils Exam : ఆర్టీసీ బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు. హాల్ టికెట్ చూపించి బస్సుల్లో ఫ్రీగానే…వెళ్లవచ్చని తెలిపారు. యూపీఎస్సీ (UPSC) ప్రిలిమ్స్ పరీక్ష 2021, అక్టోబర్ 10వ తేదీ ఆదివారం జరుగనున్న సంగతి తెలిసిందే. దీంతో వారికి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

Read More : UPSC 2022 : ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల, పూర్తి వివరాలు

కరోనా కారణంగా ఎన్నో పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ – 2021 ఎగ్జామ్ చాలా రోజుల పాటు వాయిదా పడింది. ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు అనుసరించి పరీక్షలను నిర్వహించాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది. పరీక్ష జరనున్న హైదరాబాద్ జంట నగరాలు, వరంగల్ లోని మెట్రో, ఏసీ బస్సులతో సహా అన్న రకాల సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడించింది.

Read More : UPSC : సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ – 2020 ఎగ్జామ్..నిబంధనలివే

పరీక్ష సందర్భంగా విద్యార్థులకు ఆర్టీసీ సంస్థ శుభాకాంక్షలు తెలిపింది. పరీక్ష కేంద్రానికి పది నిమిషాల ముందే చేరుకోవాలని యూపీఎస్సీ అధికారులు సూచించారు. నిబంధనలు, డ్రెస్ కోడ్ ఇతర ముఖ్య విషయాలు తప్పనిసరిగా పాటించాలని వెల్లడించారు. తమ అడ్మిట్ కార్డు, వ్యాలీడ్ ఐడీ ప్రూఫ్ పరీక్షా కేంద్రానికి తీసుకరావాల్సి ఉంటుందని, గేట్ వద్ద వీటిని చెక్ చేస్తారన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరని తెలిపారు.