UPSC : సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ – 2020 ఎగ్జామ్..నిబంధనలివే

  • Published By: madhu ,Published On : October 4, 2020 / 05:55 AM IST
UPSC : సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ – 2020 ఎగ్జామ్..నిబంధనలివే

UPSC : సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ – 2020 ఎగ్జామ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండు సెషన్లో పరీక్ష జరుగనుంది. తెలంగాణలో వరంగల్, హైదరాబాద్ లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.



మొత్తం 115 పరీక్ష కేంద్రాలున్నాయి. హైదరాబాద్ లో 99, వరంగల్ లో 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో 46 వేల 171 మంది, వరంగల్ లో 6 వేల 763 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్, ఎన్నికల కో–ఆర్డినేటింగ్‌ సూపర్‌వైజర్‌ శ్వేతా మహంతి, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు వెల్లడించారు.



పరీక్షా కేంద్రాల నిర్వహణ కోసం హైదరాబాద్‌లో వెన్యూ సూపర్‌ వైజర్లతో పాటు 99 లోకల్‌ ఇన్‌స్పెక్షన్‌ అధికారులు, 34 మంది రూట్‌ ఆఫీసర్లను నియమించారు.



ఇక విద్యార్థులకు కొన్ని నిబంధనలు విధించారు.
ప్రస్తుతం కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టలేదు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది.
ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతినించరు.



పర్సులు, వాచ్, మొబైల్‌ ఫోన్స్, పెన్‌డ్రైవ్, కాలుక్యులేటర్లు, ఇతర రికార్డింగ్‌ పరికరాలు అనుమతించరు.
అడ్మిట్‌ కార్డుతోపాటు గుర్తింపు కార్డు తప్పని సరి.
హాల్‌టికెట్‌లో సూచించిన పరీక్షా కేంద్రాల్లో మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుంది.