TSPSC : జూన్11న గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష.. అక్రమాలకు పాల్పడితే శాశ్వతంగా డిబార్ : టీఎస్పీఎస్సీ

అభ్యర్థులు చెప్పులే వేసుకోవాలని.. షూ వేసుకోవద్దని తెలిపింది. వెబ్ సైట్ లోని నమూనా ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ ప్రాక్టీస్ చేయాలని వెల్లడించింది.

TSPSC : జూన్11న గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష.. అక్రమాలకు పాల్పడితే శాశ్వతంగా డిబార్ : టీఎస్పీఎస్సీ

TSPSC (3)

Group-1 Prelims Exam : తెలంగాణలో ఆదివారం గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగనుంది. పరీక్ష కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది. అభ్యర్థులకు వాచీలు, హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు, తీసుకువచ్చేందుకు అనుమతి లేదని పేర్కొంది.

అభ్యర్థులు చెప్పులే వేసుకోవాలని.. షూ వేసుకోవద్దని తెలిపింది. వెబ్ సైట్ లోని నమూనా ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ ప్రాక్టీస్ చేయాలని వెల్లడించింది. పరీక్షలో బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలని సూచించింది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు శాశ్వతంగా డిబార్ చేస్తామని హెచ్చరించింది.

2014 Elections: మోదీ వ్యతిరేక కూటమికి దూరంగా ఉంటామంటున్న ఒమర్ అబ్దుల్లా.. తాము కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ రాలేదంటూ ఆవేదన

33 జిల్లా కేంద్రాల్లోని 994 కేంద్రాల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు జరుగనున్నాయి. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్ లో నోటిఫికేషన్ జారీ చేశారు. అక్టోబర్ 16న పరీక్ష నిర్వహించగా ఇటీవల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మళ్లీ జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పరీక్ష 3,80,032 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారందరినీ మళ్లీ పరీక్షకు అనుమంతిచనున్నారు.