ICMR JOBS : ఐసిఎమ్ ఆర్ – ఎన్ఐఈలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీ

అడ్మిన్, ఎపిడెమాలజీ, స్టాటిస్టిక్స్, నాన్ మెడికల్ ల్యాబ్ , మెడికల్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 28 ఏళ్ల నుండి 70 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

ICMR JOBS : ఐసిఎమ్ ఆర్ – ఎన్ఐఈలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీ

Icmr

చెన్నైలోని భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షమ మంత్రిత్వశాఖకు చెందిన ఐసీఎంఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్, కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్ , ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ జూనియర్ నర్స్, ప్రాజెక్ట్ స్టాఫ్ నర్స్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి.

అడ్మిన్, ఎపిడెమాలజీ, స్టాటిస్టిక్స్, నాన్ మెడికల్ ల్యాబ్ , మెడికల్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 28 ఏళ్ల నుండి 70 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 18,000రూ నుండి 1,00,000 వరకు చెల్లిస్తారు. ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును అనుసరించి పదోతరగతి, సంబంధిత స్పెషలైజేషన్ లో ఏఎన్ ఎం, నర్సింగ్ డిప్లొమా, జీఎన్ ఎం, గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్, మాస్టర్స్ డిగ్రీ , పీహెచ్ డీ, ఎండీ, ఎంఏఈ, ఎంపీహెచ్, డీపీహెచ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పనిలో అనుభవం కలిగి ఉండాలి.

ఇంటర్వ్యూకు నేరుగా హాజరుకావాల్సిన చిరునమా ; ఐసీఎంఆర్ ఎన్ఐఈ , చెన్నై, ఇంటర్వ్యూలను జూన్ 3,6,7,8, 2022 తేదిలను నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nie.gov.in/ పరిశీలించగలరు.