IISER Recruitment : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్ బోపాల్ లో ఖాళీ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ/బీఈ/బీటెక్‌/మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును అనుసరించి 56 ఏళ్ల వరకు ఉండాలి. స్ర్కీనింగ్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

IISER Recruitment : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్ బోపాల్ లో ఖాళీ పోస్టుల భర్తీ

Indian Institute of Science Education and Research Bhopal Vacancy

IISER Recruitment : భోపాల్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(ఐసర్‌)లో పలు ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రేరియన్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. సివిల్‌, ఎలక్ట్రికల్‌, ల్యాబ్‌, ఐటీ తదితర విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ/బీఈ/బీటెక్‌/మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును అనుసరించి 56 ఏళ్ల వరకు ఉండాలి. స్ర్కీనింగ్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబరు 25గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://recruitment.iiserb.ac.in/nt పరిశీలించగలరు.