అప్లై చేసుకోండి: OUలో ‘లా’ కోర్సుల దరఖాస్తు గడువు పెంపు

  • Edited By: veegamteam , November 16, 2019 / 05:40 AM IST
అప్లై చేసుకోండి: OUలో ‘లా’ కోర్సుల దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో లా విభాగంలో పీజీ డిప్లామా కోర్సులలో ప్రవేశాల దరఖాస్తు గడువును పొడిగించినట్లు లా విభాగం హెడ్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ శుక్రవారం (నవంబర్ 15, 2019)  తెలిపారు. దరఖాస్తు గడువును నవంబర్ 30వ తేది వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. 

ఇప్పటివరకు దరఖాస్తు చేసుకుని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. ప్రవేశ పరీక్షలో ఎంపికైన అభ్యర్ధులకు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అభ్యర్ధలు డిగ్రీ పాస్ కావాల్సి ఉంటుంది. 

ముఖ్యతేదిలు: 
పరీక్ష తేది: 8 డిసెంబర్, 2019.
పరీక్ష ఫలితాలు: 11 డిసెంబర్, 2019.
కౌన్సిలింగ్ తేది: 14 డిసెంబర్, 2019.