HOCL Apprentice Vacancies : హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియకు సంబంధించి విద్యార్హతలో సాధించిన మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేస్తారు.

HOCL Apprentice Vacancies : హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ షిప్ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 31 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 20, ఖాళీలు, టెక్నిషియన్ అప్రెంటిస్ 11 ఖాళీలు ఉన్నాయి. అసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియకు సంబంధించి విద్యార్హతలో సాధించిన మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేస్తారు. శిక్షణ సమయంలో ఒక ఏడాది స్టైఫండ్ చెల్లిస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ లకు రూ. 10000, టెక్నీషియన్ అప్రెంటీస్ లకు రూ. 8000 రూపాయలు చెల్లిస్తారు.
దరఖాస్తు చేసుకునేందుకు చివరితేది సెప్టెంబర్ 30, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://www.hoclindia.com పరిశీలించగలరు.