Jobs : సింగరేణి కాలరీస్ లో మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీ

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలను డైరెక్టర్‌, పీఏ అండ్‌ డబ్ల్యూ, ఎస్‌సీసీఎల్‌, ప్రధాన కార్యాలయం, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిరునామాలో నిర్వహిస్తారు.

Jobs : సింగరేణి కాలరీస్ లో మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీ

Jobs : ది సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్ సీసీఎల్)పలు పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఈ సంస్థలో 30 జనరల్ మెడికల్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అభ్యర్ధులు ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే రాష్ట్ర వైద్య మండలిలో నమోదు చేసుకొని ఉండాలి. అభ్యర్థుల వయసు 64 ఏళ్లు మించకూడదు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలను డైరెక్టర్‌, పీఏ అండ్‌ డబ్ల్యూ, ఎస్‌సీసీఎల్‌, ప్రధాన కార్యాలయం, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిరునామాలో నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీగా 4 ఆగస్టు2022 నిర్ణయించారు, ఇంటర్వ్యూలను 16 ఆగస్టు2022న ఉదయం 9.30 గంటల నుంచి నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://scclmines.com/పరిశీలించగలరు.