Professor Posts : హిమాచల్ ప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

అభ్యర్ధుల విద్యార్హతల విషయానికి వస్తే సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణతతోపాటు, నెట్,స్లెట్ అర్హత సాధించి ఉండాలి.

Professor Posts : హిమాచల్ ప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

Jobs

హిమాచల్ ప్రదేశ్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 69 ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రొఫెసర్ పోస్టులు 19, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 33, అసిస్టెంట్ ప్రొఫెసర్ 17 పోస్టులు ఉన్నాయి. యూనిమ్ సైన్స్(జువాలజీ), కెమిస్ట్రీ అండ్ కెమికల్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్, ఎన్విరాన్ మెంటల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్, మేధమెటిక్స్, జర్నలిజం, అండ్ మాస్ కమ్యూనికేషన్, సోషల్ వర్క్ తదితరాలు విభాగాల్లో ఈ ఖాళీలకు సంబంధించి నియామకం చేపట్టనున్నారు.

అభ్యర్ధుల విద్యార్హతల విషయానికి వస్తే సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణతతోపాటు, నెట్,స్లెట్ అర్హత సాధించి ఉండాలి. అకడమిక్ మెరిట్స్, టీచింగ్ , రీసుర్చ్ అప్టిట్యూడ్ సెమినార్, ఇతర వివరాల అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు.

అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా తమ ధరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తు ఫీజు విషయానికి వస్తే అన్ రిజర్డ్వ్ అభ్యర్ధులు 500 రూపాయలు, ఓబీసీలు 400 రూపాయలు, చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు లేదు. ధరఖాస్తులకు చివరితేది నవంబరు 11తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ http://www.cuhimachal.ac.in/