ఇంటర్ అర్హతతో : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC CHSL)లో ఉద్యోగాలు

  • Published By: Chandu 10tv ,Published On : November 9, 2020 / 12:12 PM IST
ఇంటర్ అర్హతతో : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC CHSL)లో ఉద్యోగాలు

SSC CHSL 2020 notification released : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఓ శుభవార్త. ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయటం కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకోసం కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్(CHSL) నుంచి నోటిఫికేషన్ వెల్లువడింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీలుగా ఉన్న లోయర్ డివిజనల్ క్లర్క్-LDC, జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్-JSA, పోస్టల్ అసిస్టెంట్-PA, సార్టింగ్ అసిస్టెంట్-SA, డేటా ఎంట్రీ ఆపరేటర్-DEO లాంటి పోస్టులన్ని భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్దులు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.



ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ మూడు దశల్లోఉంటుంది. మెుదటి దశలో కంప్యూటర్ బేస్ టెస్టు టైర్ 1 లో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, రెండో దశ టైర్ 2లో పెన్ పేపర్(వ్యాసరూప ప్రశ్నలు) పరీక్ష, మూడో దశలో స్కిల్ టెస్టు నిర్వహించి అభ్యర్దులను ఎంపిక చేస్తారు. ఇప్పటివరకు పోస్టులకు సంఖ్యను వెల్లడించలేదు. అయితే గతేడాది 4,893 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం వాటి నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఈసారి కూడా అంతే మెుత్తంలో పోస్టులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

విద్యార్హత : అభ్యర్దులు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేట్ పోస్టులకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో పాటు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.



వయస్సు : అభ్యర్దుల వయసు జనవరి 1, 2021 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వడ్ అభ్యర్దులకు వయసులో సడలింపులు వర్తిస్తాయి.
https://10tv.in/ghmc-election-notification-after-november-13th-2020/
ఎంపిక విధానం : అభ్యర్దులను కంప్యూటర్ బేస్ టెస్టు, రాత పరీక్ష, స్కిల్ టెస్టు ద్వారా ఎంపిక చేస్తారు.



దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్దులు రూ. 100 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు, ఎక్స్ – సర్వీసెస్ మెన్, మహిళా అభ్యర్దులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : నవంబర్ 6, 2020.
దరఖాస్తు చివరి తేదీ : డిసెంబర్ 15, 2020.
ఆన్ లైన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ : డిసెంబర్ 17, 2020.
ఆఫ్ లైన్ లో ఫీజు చెల్లింపునకు చివరి తేదీ : డిసెంబర్ 21, 2020.
టైర్-1 పరీక్ష తేదీలు : ఏప్రిల్ 12, 2021 నుంచి ఏప్రిల్ 27, 2021.