TMC Recruitment : టాటా మెమోరియల్ సెంటర్‌ హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌, ఎండీ, డీఎం, ఎంసీహెచ్‌, డీఎన్‌బీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 45 నుంచి 55 యేళ్ల మధ్య ఉండాలి.

TMC Recruitment : టాటా మెమోరియల్ సెంటర్‌ హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

Tata Memorial Center Homi Bhabha Cancer Hospital is filling various job vacancies

TMC Recruitment : టాటా మెమోరియల్ సెంటర్‌ కి చెందిన వారణాసిలోని హోమీ భాభా క్యాన్సర్‌ హాస్పిటల్‌ మరియు మహామాన పండిట్ మదన్‌మోహన్ మాల్వియ క్యాన్సర్ సెంటర్‌లలో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా 6 ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల వివరాలకు సంబంధించి ప్రొఫెసర్ రేడియో డయాగ్నోసిస్-జి, ప్రొఫెసర్-ఎఫ్ (మెడికల్‌ అంకాలజీ), అసిస్టెంట్ ప్రొఫెసర్-ఇ (సర్జికల్ ఆంకాలజీ), అసిస్టెంట్ ప్రొఫెసర్-ఇ (న్యూక్లియర్ మెడిసిన్), మెడికల్ ఆఫీసర్-సి (ఉమెన్‌ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్‌ ప్రివెంటివ్‌ కేర్‌) పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హతకలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌, ఎండీ, డీఎం, ఎంసీహెచ్‌, డీఎన్‌బీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 45 నుంచి 55 యేళ్ల మధ్య ఉండాలి. సంబంధిత స్పెషలేజేషన్‌లో అనుభవం కూడా ఉండాలి. రాత పరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. తుది ఎంపిక ఫలితాలు అక్టోబర్‌ 3, 2022వ తేదీన ప్రకటిస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.15,100ల నుంచి రూ.1,31,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://tmc.gov.in/ పరిశీలించగలరు.