చెక్ ఇట్ : తెలంగాణ హైకోర్టులో సివిల్ జడ్జి ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : March 4, 2020 / 10:20 AM IST
చెక్ ఇట్ : తెలంగాణ హైకోర్టులో సివిల్ జడ్జి ఉద్యోగాలు

తెలంగాణ హైకోర్టులో సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 87 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 70 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలోను, మిగిలిన 17 పోస్టులను ట్రాన్ స్ఫర్ పద్ధతిలో భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 13, 2020 నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సెలక్ట్ అయిన అభ్యర్దులను తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్ విభాగంలో పోస్టింగ్ ఇస్తారు. 

విద్యార్హత : అభ్యర్దులు లా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఏదైనా కోర్టులో అడ్వకేట్ గా 3ఏళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి.  

ఎంపికా విధానం : అభ్యర్దులను రాత పరీక్ష, ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్దులు రూ.1000 చెల్లించాలి. SC, ST అభ్యర్దులు రూ.500 చెల్లించాలి.

ముఖ్య తేదీలు : 
దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 13, 2020.
దరఖాస్తు చివరి తేదీ : ఏప్రిల్ 13, 2020.
అడ్మిట్ కార్డు జారీ తేదీ : ఏప్రిల్ 23, 2020. 
పరీక్ష తేదీ : మే 3, 2020.