ఇంటర్ బోర్డు కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి – లెక్చరర్స్ అసోసియేషన్

  • Published By: madhu ,Published On : April 20, 2019 / 10:54 AM IST
ఇంటర్ బోర్డు కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి – లెక్చరర్స్ అసోసియేషన్

ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇంటర్ ఫలితాల్లో బోర్డు నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతున్నారు. విద్యార్థులు..వారి తల్లిదండ్రుల యొక్క మానసికస్థితిని ఇంటర్ బోర్డు ఛైర్మన్ అర్థం చేసుకోకుండా..బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. ఇంటర్ ఫలితాలపై విద్యార్థులు..వారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై లెక్చరర్ల అసోసియేషన్ సభ్యులతో ఫోన్‌లో 10tv మాట్లాడింది. 

ఇంటర్..విద్యార్థులు వారి తల్లిదండ్రులకు హిస్టిరియా వ్యాధి వచ్చిందంటారా ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్స్ అసోసియేషన్ సభ్యుడు మధుసూధన్ రెడ్డి ప్రశ్నించారు. డేటా ప్రాసెసింగ్..రిజల్ట్ ప్రాసెసింగ్..విషయంలో ప్రభుత్వ సంస్థలు విధులు నిర్వహించే వాటిని తప్పించి..ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యార్థులకు నష్టం కలిగించే అనేక చర్యలు జరిగాయని, పేపర్లు దిద్దే అధ్యాపకులు తీవ్రమైన వత్తిడికి గురయ్యారని తెలిపారు. డిస్ట్రిక్ టాపర్ తెలుగులో ఫెయిల్ అవుతారా ? అని నిలదీశారు. 

పేపర్లు దిద్దాలని అధ్యాపకులు రిక్వెస్ట్ చేస్తే ఆయన వ్యవహరించిన తీరు గర్హనీయమని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం సభ్యుడు కత్తి వెంకటస్వామి తెలిపారు. ఇంటర్ బోర్డులో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి కారణం ఛైర్మన్ అని, వెంటనే ఇతడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. 

తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఇంటర్ ఫలితాలు తీవ్ర గందరగోళానికి దారి తీస్తున్నాయి. మెరిట్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ కావడం..అన్నీ సబ్జెక్టుల్లో అత్యధికంగా మార్కులు వచ్చినా..ఒకటి, రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడం వారిని షాక్‌కు గురి చేసింది. సబ్జెక్టుల్లో 90 మేర మార్కులు వచ్చి..ఒక సబ్జెక్టులో కేవలం 4 మార్కులు రావడం ఏంటీ అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

పేపర్లు దిద్దకుండానే ఇష్టానుసారంగా మార్కులు వేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టూడెంట్స్..వారి పేరెంట్స్ ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన చేపట్టారు. దీనిపై ఇంటర్ బోర్డు కార్యదర్శి రెస్పాండ్ అయ్యారు. బోర్డు ఎలాంటి తప్పిదాలు చేయలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి.