Job Vacancies : తెలంగాణా మెడికల్ హెల్త్ సర్వీసెస్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ల విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్ తో పాటు అందుకు సమానవైన విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

Job Vacancies : తెలంగాణా మెడికల్ హెల్త్ సర్వీసెస్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
ad

Job Vacancies : తెలంగాణలో మెడికల్ హెల్త్ సర్వీసెస్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1326 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలకు సంబంధించి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 731ఖాళీలు, ట్యూటర్ ఖాళీలు 357ఖాళీలు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ 211ఖాళీలు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఖాళీలు 7 ఉన్నాయి.

సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ల విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్ తో పాటు అందుకు సమానవైన విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టరై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్లు ఉండాలి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 14, 2022ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm