TS EDCET : టీఎస్ ఎడ్ సెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు

అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమకు దగ్గర్లో ఉన్న పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాలన్నారు.

TS EDCET : టీఎస్ ఎడ్ సెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు

TS EDCET

TS EDCET : తెలంగాణలో బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్ సెట్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. మే1వ తేదీ వరకు దరఖాస్తు గడువును పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు ఎలాంటి ఆలస్య ఫీజు చెల్లించకుండా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువును మే1వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు టీఎస్ ఎడ్ సెట్ కన్వీనర్ ప్రొ.ఏ రామకృష్ణ ప్రకటించారు.

అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమకు దగ్గర్లో ఉన్న పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాలన్నారు. జనరల్, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

Common Entrance Tests: మే 7న తెలంగాణ ఎంసెట్… 18న ఎడ్ సెట్.. ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

మే5వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎడ్ సెట్ ను మే18న ఏపీ, తెలంగాణలో నిర్వహించున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. కాగా, ఎడ్ సెట్ ను ఈ ఏడాది నల్లగొండలోని మహాత్మగాంధీ యూనిర్సిటీ నిర్వహించనుంది. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించింది.