ఐదేళ్లు పూర్తి చేసుకున్నTSPSC : 39వేల నేటిఫికేషన్లు విడుదల

టీఎస్ పీఎస్ సీ విజయవంతంగా ఐదేళ్లు పూర్తి చేసుందని కమిషన్ చైర్మన్‌ ఘంటా చక్రపాణి అన్నారు. ఈ ఐదేళ్లలో 39వేల నేటిఫికేషన్లను విడుదల చేశామని ఆయన తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : December 19, 2019 / 09:27 AM IST
ఐదేళ్లు పూర్తి చేసుకున్నTSPSC : 39వేల నేటిఫికేషన్లు విడుదల

టీఎస్ పీఎస్ సీ విజయవంతంగా ఐదేళ్లు పూర్తి చేసుందని కమిషన్ చైర్మన్‌ ఘంటా చక్రపాణి అన్నారు. ఈ ఐదేళ్లలో 39వేల నేటిఫికేషన్లను విడుదల చేశామని ఆయన తెలిపారు.

టీఎస్ పీఎస్ సీ విజయవంతంగా ఐదేళ్లు పూర్తి చేసుందని కమిషన్ చైర్మన్‌ ఘంటా చక్రపాణి అన్నారు. ఈ ఐదేళ్లలో 39వేల నేటిఫికేషన్లను విడుదల చేశామని ఆయన తెలిపారు. TSPSC ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘంటా చక్రపాణి ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల నియామకం కోసం ప్రభుత్వం టీఎస్‌పీఎస్‌సీని ఏర్పాటు చేసింది. 2014 డిసెంబర్ 18న TSPSC ఏర్పాటైంది. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి TSPSC అనేక సవాళ్లను ఎదుర్కోంటూ వస్తుందన్నారు. తెలంగాణలో నిరుద్యోగులకు త్వరలో శుభవార్త అందుతుందని తెలిపారు. నిరుద్యోగులు నిశ్చితంగా ఉండాలని, ఉద్యోగాల కోసం ప్రిపరేషన్లలో ఉండొచ్చని సూచించారు. త్వరలోనే ప్రభుత్వం తీపికబురు అందిస్తుందన్నారు. గత ఐదేళ్ల కాలంలో టీఎస్‌పీఎస్‌సీ 101 నోటిఫికేషన్లు జారీ చేసిందని చెప్పారు.
 
ప్రభుత్వం నుంచి వచ్చిన వాటిలో 39వేల ఉద్యోగాల భర్తీ చేపట్టామని, అందులో 30వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. 5 వేల నుంచి 6వేల ఉద్యోగాలకు సంబంధించిన కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. మిగిలిన మూడు వేల ఉద్యోగాలను కూడా ఒకటి, రెండు నెలల్లో భర్తీ చేస్తామని చెప్పారు.