Gujarat Polls: ఆప్‭కు అంత సీన్ లేదు.. ఒక్క సీటు కూడా గెలవదంటూ అమిత్ షా ఎద్దేవా

తాజాగా పీటీఐకి అమిత్ షా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆప్ పోటీపై స్పందిస్తూ ‘‘ప్రతి పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. అయితే ఆ పార్టీని ఆదరించాలా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆప్ అనేది గుజరాత్ ప్రజల మనస్సుల్లో లేనే లేదు. తొందరేముంది? ఎన్నికల ఫలితాలు రానివ్వండి. గెలిచిన అభ్యర్థుల జాబితాలో ఆప్ అభ్యర్థి ఒక్కరు కూడా ఉండకపోవచ్చు'' అని అమిత్ షా అన్నారు.

Gujarat Polls: ఆప్‭కు అంత సీన్ లేదు.. ఒక్క సీటు కూడా గెలవదంటూ అమిత్ షా ఎద్దేవా

AAP May Not Open Account, Opposition Nowhere Close To PM Modi, Says Amit Shah

Updated On : November 30, 2022 / 4:48 PM IST

Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ విస్తృత ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సైతం పలు సందర్భాల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రకటనలు వెలువరిస్తున్నారు. అయితే ఆప్‭కు అంత సీన్ లేదని, ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన ఆప్.. ఆ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే జరుగుతోన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై బాగానే ఆశలు పెట్టుకుంది. సుదీర్ఘ కాలంగా పాలిస్తున్న బీజేపీ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకుని ఎలాగైనా సరే.. గుజరాత్‭లో సెటిలవ్వాలని ఉవ్విళ్లూరుతోంది.

Bilkis Bano Case: 11 మంది అత్యాచార దోషుల విడుదలను సవాల్ చేస్తూ సుప్రీం గడప తొక్కిన బిల్కిస్ బానో

కాగా, తాజాగా పీటీఐకి అమిత్ షా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆప్ పోటీపై స్పందిస్తూ ‘‘ప్రతి పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. అయితే ఆ పార్టీని ఆదరించాలా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆప్ అనేది గుజరాత్ ప్రజల మనస్సుల్లో లేనే లేదు. తొందరేముంది? ఎన్నికల ఫలితాలు రానివ్వండి. గెలిచిన అభ్యర్థుల జాబితాలో ఆప్ అభ్యర్థి ఒక్కరు కూడా ఉండకపోవచ్చు” అని అమిత్ షా అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీపై ఆయన స్పందిస్తూ.. ఇప్పటికీ ప్రధాన విపక్ష పార్టీయని, అయితే ఆ పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, అది గుజరాత్ ఎన్నికల్లో కూడా కనిపిస్తుందని అన్నారు.

NDTV: పూర్తిగా అదానీ చేతుల్లోకి NDTV.. డైరెక్టర్లుగా రాజీనామా చేసిన ప్రణయ్ రాయ్, రాధికా రాయ్

గుజరాత్ ప్రజల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న వెలకట్టలేనిదని అమిత్ షా అన్నారు. మోదీపైనే కాకుండా భారతీయ జనతా పార్టీపై సైతం గుజరాతీలు సానుకూల భావనతో ఉన్నారని, అందుకే పార్టీ 27 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతోందని, ఈ ఎన్నికల్లో కూడా అది పునరావృతమవుతుందని అన్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో బీజేపీ అసాధారణ మెజారిటీ సాధిస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

Nirmala Sitharaman: సాంకేతికత ఉపయోగించి రూ.2,00,000 కోట్లు ఆదా చేశాం.. కేంద్ర ఆర్థిక మంత్రి