Bilkis Bano Case: 11 మంది అత్యాచార దోషుల విడుదలను సవాల్ చేస్తూ సుప్రీం గడప తొక్కిన బిల్కిస్ బానో
ఈ పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం, దోషుల విడుదల విషయంలో గతంలో దాఖలైన పిటిషన్లతో కలిపి విచారించొచ్చా లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్లలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ సమయంలో ఆమె ఐదు నెలల గర్భిణి. అంతే కాకుండా ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు

Bilkis Bano moves Supreme Court challenging release of 11 rape convicts
Bilkis Bano Case: తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దోషుల విడుదలను వ్యతిరేకిస్తూ బాధితురాలు బిల్కిస్ బానో సుప్రీం కోర్టు గడప తొక్కారు. గుజరాత్ ప్రభుత్వం వీరిని విడుదల చేయడాన్ని ఆమె సుప్రీంలో సవాల్ చేశారు. రెమిషన్ పాలసీ ఉత్తర్వులను పున:సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ వేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ పిటిషన్ను బిల్కిస్ తరపు న్యాయవాది తీసుకొచ్చారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ముందు రోజు ఈ కేసు మరోసారి సుప్రీం ముందుకు రావడం గమనార్హం.
Inter-State Gang Arrest :హైదరాబాద్లో అక్రమంగా డ్రగ్స్ సరఫరా.. అంతర్రాష్ట్ర ముఠాలు అరెస్టు
కాగా, ఈ పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం, దోషుల విడుదల విషయంలో గతంలో దాఖలైన పిటిషన్లతో కలిపి విచారించొచ్చా లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్లలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ సమయంలో ఆమె ఐదు నెలల గర్భిణి. అంతే కాకుండా ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసులో 11 మంది నేరస్తులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు శిక్ష విధించింది. బాంబే హైకోర్టు సైతం ఈ శిక్షను సమర్ధించింది. కాగా, ఈ శిక్ష పూర్తిగా ముగియక ముందే రెమిషన్ పాలసీ కింద వీరిని ముందస్తుగా విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం.
కాగా, జైలు నుంచి వీరు బయటికి వచ్చినప్పుడు వారిని పూల దండలు, మిఠాయిలతో స్వాగతం పలకడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అనేక విమర్శలు సైతం వచ్చాయి. వీరి విడుదలను సవాల్ చేస్తూ ఆ సమయంలోనే కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా బాధితురాలే స్వయంగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.