BMC Polls: ఉద్ధవ్ థాకరేకు మద్దతుగా ముంబైలో ఎన్నికల ప్రచారం చేయనున్న తేజశ్వీ యాదవ్

2017లో బీఎంసీకి జరిగిన ఎన్నికల్లో శివసేన అత్యధికంగా 84 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 82 స్థానాలు గెలుచుకుంది. ఆ సమయంలో ఇరు పార్టీలు పొత్తులో ఉన్నాయి. అయితే 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇరు పార్టీలు విడిపోయాయి. దీంతో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి బీఎంసీని చేజిక్కించుకుంది శివసేన. కొద్ది రోజుల క్రితం శివసేనలో చీలిక వచ్చి పార్టీ రెండుగా విడిపోయినప్పటికీ.. బీఎంసీలోని కార్పొరేటర్లు మాత్రం ఉద్ధవ్ థాకరేతోనే ఉన్నారు.

BMC Polls: ఉద్ధవ్ థాకరేకు మద్దతుగా ముంబైలో ఎన్నికల ప్రచారం చేయనున్న తేజశ్వీ యాదవ్

Bihar deputy CM Tejashwi Yadav likely to campaign for Uddhav Sena in Mumbai

BMC Polls: ముంబై నగర మున్సిపాలిటీ (బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) ఎన్నికల్లో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనకు మద్దతుగా బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ కీలక నేత తేజశ్వీ యాదవ్ ప్రచారం చేయనున్నారు. బుధవారం బిహార్ రాజధాని పాట్నాకు వెళ్లిన ఆదిత్య థాకరే.. తేజశ్వీని కలుసుకున్నారు. ఈ సమావేశం ముగిసిన మరునాడే బిహార్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.

వచ్చే లోక్‭సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడం కంటే ముందు తాము అధికారంలో ఉన్న బీఎంసీని కాపాడుకోవడం శివసేన (ఉద్ధవ్ వర్గం) ముందున్న పెద్ద సవాల్. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక పక్షాలను ముంబైకి రప్పించి బీజేపీని నిలువరించేందుకు ప్రచారం చేయించాలని థాక్రే ఆలోచిస్తున్నారట. ఇందులో భాగంగానే ఆదిత్య బిహార్ వెళ్లినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి పాల్గొన్న ప్రియాంక, రాబర్ట్ వాద్రా

2017లో బీఎంసీకి జరిగిన ఎన్నికల్లో శివసేన అత్యధికంగా 84 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 82 స్థానాలు గెలుచుకుంది. ఆ సమయంలో ఇరు పార్టీలు పొత్తులో ఉన్నాయి. అయితే 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇరు పార్టీలు విడిపోయాయి. దీంతో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి బీఎంసీని చేజిక్కించుకుంది శివసేన. కొద్ది రోజుల క్రితం శివసేనలో చీలిక వచ్చి పార్టీ రెండుగా విడిపోయినప్పటికీ.. బీఎంసీలోని కార్పొరేటర్లు మాత్రం ఉద్ధవ్ థాకరేతోనే ఉన్నారు.

227 స్థానాలున్న బీఎంసీలో చాలా కాలంగా శివసేనదే పట్టు కొనసాగుతోంది. మహారాష్ట్రలో చూపే ప్రభావం కంటే ముంబై నగరంలో శివసేకు ఎక్కువ పట్టు ఉంది. కాగా, ప్రస్తుతం శివసేకు శివసేన వర్గమే పోటీగా మారింది. పైగా షిండేను నిలువరించి అసలైన శివసేన తమదే అని నిరూపించుకోవాలంటే బీఎంసీ ఎన్నికల్లో గెలుపు అనివార్యం. దీంతో ఎలాగైనా గెలిచి తీరాలనే సంకల్పంలో బీజేపీ వ్యతిరేక శక్తులను ముంబైకి రప్పించే పనిలో థాక్రే బిజీగా ఉన్నారు.

Pak Army Chief: పాకిస్తాన్ ఆర్మీకి కొత్త బాస్.. ఆసిం మునీర్‭ను నియమిస్తున్నట్లు ప్రధాని ప్రకటన