Rainy Season : వర్షాకాలం పిల్లల ఆరోగ్యం సురక్షితంగా ఉండాలంటే ఆహారంలో మార్పులు తప్పనిసరి!

వర్షాకాలంలో అయితే ఊరికే పిల్లలు జ్వరం, జలుబు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఈ కాలంలో క్రిములు ఎక్కువగా పిల్లల పై దాడి చేస్తుంటాయి. అపరిశుభ్ర నీరు కారణంగా అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు. కాబట్టి పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచడం ఎంతో అవసరం.

Rainy Season : వర్షాకాలం పిల్లల ఆరోగ్యం సురక్షితంగా ఉండాలంటే ఆహారంలో మార్పులు తప్పనిసరి!

Changes in food are essential to keep the health of children safe during the rainy season!

Updated On : September 8, 2022 / 12:40 PM IST

Rainy Season : ప్రతి సంవత్సరం వర్షాకాలం వాతావరణం అకస్మాత్తుగా మారుతుంది. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు రావడంతో రకరకాల అనారోగ్యాలు, అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్ సాధారణంగా గాలిలో వ్యాపించే వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. వర్షాకాలంలో పిల్లలు చురుకుగా ఉండటం చాలా ముఖ్యం. పిల్లలు రోజులో కొంత శారీరక శ్రమలో పాల్గొనడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో రోజువారీ ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం, కూరగాయలను చేర్చుకోవాలి. ఈ ఆహార పదార్థాలలో ఆకుకూరలు , తాజా సీజనల్ పండ్లు తీసుకోవాలి. ఇంట్లో తయారుచేసిన తాజా పండ్ల రసాలు, రుచిగల పాలు వంటి పానీయాలు. అల్లం, తులసి, తేనె, పసుపు, నిమ్మకాయ, చిలగడదుంప మొదలైన రోగనిరోధక శక్తిని పెంచే వాటిని తీసుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది.

రోగనిరోధక వ్యవస్థలను రక్షించడానికి మన ఆహారంలో విటమిన్ సి ఆహారాలు ఉండేలా చూసుకోవాలి. నారింజ, మొసాంబి, నిమ్మ, యాపిల్, అరటి, బీట్‌రూట్, టొమాటో వంటి సిట్రస్ పండ్లు మంచివి. తల్లిదండ్రులు తమపిల్లల జీవనశైలిలో చిన్న చిన్న మార్పులను చేయడం ద్వారా వారి రోగనిరోధక శక్తిని వర్షాకాలంలో పెంపొందేలా చేయవచ్చు. రోటీ, నెయ్యి, బెల్లం రోల్స్, సెమోలినా పుడ్, బెల్లం లడ్డు, రాగి లడ్డు తినిపించాలి. జీడిపప్పుతో చేసే ఆహారాలను ఇస్తుండాలి. కొవ్వు అధికంగా ఉండే జంక్‌ ఫుడ్‌ తినకుండా చూడాలి. పిల్లలకు ప్రతి రోజు నెయ్యి, పప్పుతో అన్నం పెట్టాలి.

వర్షాకాలంలో అయితే ఊరికే పిల్లలు జ్వరం, జలుబు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఈ కాలంలో క్రిములు ఎక్కువగా పిల్లల పై దాడి చేస్తుంటాయి. అపరిశుభ్ర నీరు కారణంగా అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు. కాబట్టి పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచడం ఎంతో అవసరం. ఇమ్యునిటీ పెర‌గ‌టం వ‌ల్ల పిల్లలు అనారోగ్యం బారిన ప‌డ‌కుండా ఉంటారు. ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు కలిగిన ఆహారాన్ని మరియు జాగ్రత్తలను పిల్లలకు తెలియజేయాలి. తద్వారా వర్షాకాలంలో వారి ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అదే క్రమంలో పిల్లలు అనారోగ్యాలు, వైకల్యాల బారిన పడకుండా ఉండటానికి,రోగ నిరోధక శక్తి పెంపొందించడం కోసం టీకాలు వేయించడం తప్పనిసరి అని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి.