గోమూత్రంతో క్యాన్సర్‌కు మందులు : కేంద్ర మంత్రి అశ్వనీకుమార్‌ చౌబే

  • Published By: veegamteam ,Published On : September 8, 2019 / 06:01 AM IST
గోమూత్రంతో క్యాన్సర్‌కు మందులు : కేంద్ర మంత్రి అశ్వనీకుమార్‌ చౌబే

క్యాన్సర్ మహమ్మారిని మట్టుపెట్టేందుకు..క్యాన్సర్ బాధితులకు ఉపశమనం కల్పించేందుకు ఎంతోమంది సైంటిస్టులు నిరంతరం పరిశోధనలు జరుపుతున్నారు.క్యాన్సర్ ను పూర్తిగా అరికట్టేందుకు మందులను తయారు చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో క్యాన్సర్ కు గోమూత్రంతో మందులు తయారు చేయనున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వనీకుమార్‌ చౌబే తెలిపారు. 

ఆయుర్వేద, యోగ అండ్ నేచురోపతి, యునానీ, సిద్ధ అండ్ హోమియోపతి(ఆయుష్) మంత్రిత్వశాఖ గోమూత్రంతో ఔషధాలు తయారు చేయనున్నందని  మంత్రి  తెలిపారు.  క్యాన్సర్ వంటి దీర్ఘకాలికి రోగాలకు కూడా గోమూత్రంతో మెడిసిన్స్ తయారుచేయవచ్చన్నారు. అశ్వనీ కుమార్ చౌబే తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ చౌబే మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకంలో క్యాన్సర్ చికిత్సను కూడా చేర్చేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ యోచిస్తోందని తెలిపారు.

డయాబెటిస్, క్యాన్సర్ వంటి నాన్-కమ్యూనికేట్ వ్యాధులు ప్రపంచానికి ఒక సవాలుగా మారిందనీ..వీటిని పూర్తిగా నిర్మూలించమని  క్లెయిమ్ చేయలేం..కానీ వాటిని  నియంత్రించగలం. అంతేకాదు..దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న భారత్ ప్రభుత్వం 2030కల్లా వీటిని నియంత్రించాలనే లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి అనిల్ కుమార్ చౌబే తెలిపారు.