Dancing Improves Fitness : డ్యాన్స్ మంచిదే.. కొవ్వు తగ్గిస్తుంది, ఫిట్‌గా ఉంచుతుంది

డ్యాన్స్ ఆరోగ్యానికి మంచిదే. అవును.. డ్యాన్స్ చేయడం వల్ల హెల్త్ పరంగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. నాట్యం చేయడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అంతేకాదు బాడీ ఫిట్ గానూ ఉంటుంది. మరీ ముఖ్యంగా

Dancing Improves Fitness : డ్యాన్స్ మంచిదే.. కొవ్వు తగ్గిస్తుంది, ఫిట్‌గా ఉంచుతుంది

Dancing Improves Fitness

Dancing Improves Fitness : డ్యాన్స్ ఆరోగ్యానికి మంచిదే. అవును.. డ్యాన్స్ చేయడం వల్ల హెల్త్ పరంగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. నాట్యం చేయడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అంతేకాదు బాడీ ఫిట్ గానూ ఉంటుంది. మరీ ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన మహిళల విషయంలో. ఓ అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు తెలిశాయి.

వాస్తవానికి రుతుక్రమం ఆగిపోయిన మహిళలు బరువు పెరుగుతారు. శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది. జీవక్రియ డిస్ట్రబ్ అవుతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అదే సమయంలో రుతుక్రమం ఆగిపోయిన మహిళలు శారీరకంగా తక్కువ చురుకుగా ఉంటారు. వారిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాయి. శరీరంలో మార్పుల కారణంగా వారిలో ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతుంది.

ఈ క్రమంలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది? శరీర కూర్పు ఎలా ఉంటుంది? జీవక్రియలో మార్పులు ఉంటాయా? ఫిట్ నెస్ ఎలా ఉంటుంది? అనేదానిపై పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. నాట్యం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్టు గుర్తించారు. వారానికి మూడుసార్లు డ్యాన్స్ చేయడం వల్ల రుతుక్రమం ఆగిన మహిళలు అనేక ప్రయోజనాలు పొందొచ్చని పరిశోధకులు చెప్పారు.

డ్యాన్స్ థెరపీతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కొవ్వు స్థాయులను సమతుల్యం చేస్తుంది. ఫిట్ నెస్ పెంచుతుంది. దాంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నిపుణులు చెప్పారు. బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, భంగిమ నియంత్రణకు, నడక, శక్తి, శారీరక పని తీరు మెరుగవడానికి డ్యాన్స్ థెరపీ ఉపయోగపడుతుందన్నారు.

డ్యాన్స్ థెరపీతో ఫిట్ నెస్, మెటబాలిజం మాత్రమే కాదు ఆత్మవిశ్వాసం కూడా మెరుగవుతుంది. వారానికి మూడు సార్లు డ్యాన్స్ క్లాస్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు కొత్తగా ఏదో నేర్చుకున్న అనుభూతిని మహిళలు పొందుతారని వారిలో నూతనోత్సాహం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా డ్యాన్స్ తో ఎంజాయ్ మెంట్ మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు తేల్చారు.