Covid Medicine : కరోనా రోగులకు హెచ్చరిక.. విచ్చలవిడిగా మందులు వాడితే ప్రమాదమే

కరోనా బారిన పడ్డ వారికి ఇదో హెచ్చరికి. విచ్చలవిడిగా మందులు వాడేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే అంటున్నారు డాక్టర్లు.

Covid Medicine : కరోనా రోగులకు హెచ్చరిక.. విచ్చలవిడిగా మందులు వాడితే ప్రమాదమే

Covid Medicine

Covid Medicine : కరోనా బారిన పడ్డ వారికి ఇదో హెచ్చరికి. విచ్చలవిడిగా మందులు వాడేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే అంటున్నారు డాక్టర్లు. కోవిడ్ రోగులు విచ్చలవిడిగా మందులు వాడొద్దని టిమ్స్ ప్రొఫెసర్, డాక్టర్ శ్రీభూషణ్ రాజు సూచించారు. డాక్టర్ల సూచనల మేరకే మందులు వాడాలన్నారు. నాలుగైదు రోజులకు మించి రకరకాల మందులు వాడితే భవిష్యత్తులో ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయో చెప్పలేము అన్నారు డాక్టర్ శ్రీభూషణ్ రాజు.

”మందులన్నీ లోనికి వెళ్లి ఎక్కడో ఒక చోట పేరుకుపోతాయి. దీర్ఘకాలంలో వాటి వల్ల సంభవించే ప్రభావం ఇప్పుడే చెప్పడం చాలా కష్టం. కోటాను కోట్ల మంది ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు. ఒకటి కాదు.. అనేక రకాల మందులు వేసుకుంటున్నారు. ఏ మందు వల్ల వారికి కాలక్రమేణ హాని జరుగుతోంది, లివర్ లో కానీ, ఊపిరితిత్తుల్లో కానీ గుండెలో లేదా నరాలు, ఎముకల్లో మార్పులు ఏ విధంగా వచ్చాయి దానికి ఏది కారణమో చెప్పడం కూడా చాలా కష్టం. కలగూరగంపలాగా చాలామందులు వేసుకుంటున్నారు. మందులు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం వ్యాధి లక్షణాల ఆధారంగా ఉన్నటువంటి మందులు మాత్రమే వేసుకోవాలి. విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ వేసుకోవడం, తద్వారి వచ్చే సమస్యలను కేవలం కరోనా వల్లే వచ్చిందని ఆపాదించడం కరెక్ట్ కాదు” అని డాక్టర్ రాజు అన్నారు.