Conjunctivitis Scare : వేగంగా వ్యాప్తి చెందుతున్న కండ్లకలక.. ప్రయాణసమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

కంటి ఫ్లూ వ్యాప్తిని నిరోధించడంలో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరి. వివిధ ప్రదేశాల్లో వస్తువులను తాకిన తరువాత పదేపదే చేతులతో కళ్లను తాకడం మానుకోవాలి. దీని వల్ల కళ్లకు వైరస్‌ వచ్చేలా చేస్తుంది.

Conjunctivitis Scare : వేగంగా వ్యాప్తి చెందుతున్న కండ్లకలక.. ప్రయాణసమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

Conjunctivitis Scare

Conjunctivitis Scare : దేశంలోని అనేక ప్రాంతాల్లో కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి. అంటువ్యాధిగా విస్తరిస్తున్న ఈ వైరల్/బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పాఠశాల విద్యార్థుల నుండి కార్యాలయానికి వెళ్లే వారి వరకు పెద్ద సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేస్తోంది. ప్రధానంగా ఇది వైరస్, బ్యాక్టీరియా , అలెర్జీల వల్ల, వరదలు, వర్షాల కారణంగా కంటి ఫ్లూ ఇన్‌ఫెక్షన్‌లు గతంలో ఎన్నడూ లేనంతగా భారీగా పెరిగాయి.

READ ALSO : Delhi-Mumbai Flight : విమానంలో ప్రొఫెసర్ వెర్రివేషాలు .. మహిళా డాక్టర్‌‌పై లైంగిక వేధింపులు,అరెస్ట్

ఈ ఇన్ఫెక్షన్, వల్ల కళ్ళు ఎర్రగా, దురదగా, జిగటగా, బాధాకరంగా , దృష్టిని అస్పష్టంగా మారుస్తుంది. కండ్లు పూర్తిగా కోలుకోవడానికి ఒకటి లేదా రెండు వారాలు పట్టవచ్చు. ఈ ఇన్‌ఫెక్షన్ కంటి ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించనప్పటికీ ఇది తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది. రోజువారి పనికి ఆటంకం కలిగిస్తుంది. కండ్ల కలక సమయంలో బయటకు వెళ్లడం ఏమాత్రం సరైంది కాదు. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ తో ఉన్నవారు ఎవరి కళ్లలోకి చూసినా ఐ ఫ్లూ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈ సమస్యతో బాధపడుతున్నవారు కండ్లను తాకి ఇతర ప్రదేశాలను ముట్టుకున్నా వైరస్ చాలా సేపు ఆ వస్తువుల ఉపరితలాలపై ఉండటం వల్ల కండ్లకలక వేగంగా వ్యాపిస్తుంది. డోర్క్‌నాబ్, బెడ్‌షీట్, డోర్లు, టవల్, రుమాలు వంటి వాటిని తాకిన ఎవరైనా ఇన్‌ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. బాక్టీరియల్ కండ్లకలక స్టెఫిలోకాకల్ లేదా స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అయితే అన్ని రకాల కండ్లకలక అంటువ్యాధి కాదు.

READ ALSO : Bengaluru Woman: ‘మరీ తెల్లగా ఉన్నారు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేం’ కంపెనీ సమాధానానికి షాక్ అయిన యువతి

అయితే ప్రస్తుతం పెరుగుతున్న కండ్లకలక అంటువ్యాధిగా ఒకరి నుండి మరొకరి వేగంగా వ్యాప్తిచెందుతుంది. దీని బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించాలి. ప్రజలకు కండ్లకలక వచ్చే మార్గాలలో ప్రజా రవాణా కూడా ఒకటి.

ప్రయాణిస్తున్నప్పుడు కండ్లకలక వ్యాధిని నివారించడానికి చిట్కాలు ;

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ బస్సు, ట్రైన్ , షేర్ ఆటోలు వంటి వాటిని ఉపయోగిస్తున్నప్పుడు కళ్ళను కాపాడుకోవడానికి, కంటి ఫ్లూ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి నిపుణులు కొన్ని జాగ్రత్తలను పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

READ ALSO : Cobra In Man Shirt : మందుబాబు షర్టులో దూరిన కింగ్ కోబ్రా .. వెన్నులో ఒణుకు పుట్టించే వీడియో

1. సన్ గ్లాసెస్ లేదా రక్షణ కళ్లద్దాలు ధరించటం ;

ప్రయాణ సమయాల్లో సన్ గ్లాసెస్ లేదా ఇతర రక్షణ కళ్లద్దాలను ధరించటం మంచిది. దీని వల్ల కంటి ఫ్లూ వైరస్‌ను మోసుకెళ్లే గాలిలోని కణాలు, ధూళి , సూక్ష్మక్రిములు అవరోధంగా పనిచేస్తుంది. ర్యాప్‌రౌండ్ సన్ గ్లాసెస్ ప్రభావవంతంగా ఉంటాయి, ఎందుకంటే అవి మీ కళ్ళను అన్ని కోణాల నుండి కాపాడతాయి.

2. చేతు పరిశుభ్రతను పాటించటం ;

కంటి ఫ్లూ వ్యాప్తిని నిరోధించడంలో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరి. వివిధ ప్రదేశాల్లో వస్తువులను తాకిన తరువాత పదేపదే చేతులతో కళ్లను తాకడం మానుకోవాలి. దీని వల్ల కళ్లకు వైరస్‌ వచ్చేలా చేస్తుంది. హ్యాండ్ శానిటైజర్ బాటిల్‌ని వెంట తీసుకెళ్లండి. ఏదైనా వస్తువలును తాకిన తరువాత హ్యాండ్ శానిటైజర్ ను ఉపయోగించండి.

READ ALSO : Anushka Shetty : సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న అనుష్క.. ఆ సినిమా తర్వాత?

3. ముఖాన్ని తాకడం మానుకోవటం ;

చేతులను కడగకుండా కళ్ళు, ముక్కు , నోటిని తాకడం మానుకోవాలి. ఎందుకంటే ఇది ఐ ఫ్లూ వైరస్ వ్యాప్తికి ఒక మార్గం. చేతులు శుభ్రంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాతనే తాకటం మంచిది. లేదంటే టిష్యూని ఉపయోగించటం మంచిది.

4. సామాజిక దూరాన్ని పాటించండి ;

ఎదుటివారి మాట్లాడుతున్న సందర్భంలో వారికి కొంత దూరం పాటించటం మంచిది. వారి శ్వాసకోశ బిందువులు పడకుండా చూసుకోవాలి. అస్వస్థత బాధపడుతున్న వ్యక్తులకు దూరంగా నిలబడటం లేదా కూర్చోవడం వల్ల వైరస్ సంక్రమించే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

READ ALSO : Sandra Bullock : బర్త్ డే విషెస్ ఇలా కూడా చెబుతారా నాయనా.. మరి నగ్న వీడియోతో..!

5. వ్యక్తిగత వస్తువులను క్రిమిసంహారక చేయటం ;

మొబైల్ ఫోన్‌లు లేదా బ్యాగ్‌లు వంటి వ్యక్తిగత వస్తువులను మీతో తీసుకువెళితే, వాటిని క్రమం తప్పకుండా శానిటైజ్ చేయటం మంచిది. సూక్ష్మక్రిములు ఈ ఉపరితలాలపై నివసిస్తాయి. వాటిని తాకినట్లయితే సులభంగా కళ్ళకు ఇన్ఫెక్షన్ వ్యాపించే ప్రమాదం ఉటుంది.