మన మెదడులో మెమరీ ఎలా స్టోర్ అవుతుందో తెలుసా? ఇదిగో కొత్త థియరీ

మన మెదడులో మెమరీ ఎలా స్టోర్ అవుతుందో తెలుసా? ఇదిగో కొత్త థియరీ

how memories stored in the brain : కంప్యూటర్ మెమెరీ మాదిరిగానే మన మెదడులో కూడా మెమరీ స్టోర్ అవుతుంది. ఇంతకీ ఈ మెదడు మెమెరీలను స్టోర్ చేయడంలో ఎలా పనిచేస్తుంది? మెమరీ ఫంక్షన్ ఎలా ఉంటుంది అనేదానిపై కెంట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు కొత్త థియరీని ప్రవేశపెట్టారు. అదే.. MeshCODE థియరీ.. ఈ విప్లవాత్మక కొత్త సిద్ధాంతం ద్వారా మెదడు పనితీరును అర్థం చేసుకోవడానికి సాధ్యపడుతుంది.

అంతేకాదు.. మెదడు సంబంధిత వ్యాధుల్లో ఒకటైన అల్జీమర్స్ (మతిమరుపు) వంటి వ్యాధులకు చికిత్స అందించడంలో కూడా ఈ థియరీ సాయపడుతుందని రీసెర్చర్లు భావిస్తున్నారు. ఈ కొత్త థియరీ‌తో మెదడు పనితీరుపై లోతుగా అధ్యయనం చేశారు. మెదడులోని అతి సున్నితమైన సూక్ష్మ కణాలు సూపర్ కంప్యూటర్ మాదిరిగా కాంప్లెక్స్ బైనరీ కోడ్‌తో న్యూరోనల్ సెల్స్ నిక్షిప్తమై ఉంటాయి. ఈ న్యూరో సెల్స్ మెకానికల్ కంప్యూటర్ లా నిరంతరం పనిచేస్తుంటాయి.

కంప్యూటర్ లో అయితే డేటా బైనరీ కోడ్ ఎలా పనిచేస్తుందో మన మెదడులోని న్యూరో కణాలు కూడా బైనరీ కోడ్ రూపంలో మెమెరీని స్టోర్ చేస్తాయి. మెదడులోని ప్రతి సినాప్సే కాంప్లెక్స్ బైనరీ కోడ్ లా పనిచేస్తూ మెమరీ అణువులను స్టోర్ చేస్తుంటుంది. ఈ కోడ్ ద్వారా బ్రెయిన్‌లో స్టోరేజీ డేటా ఫిజికల్ లొకేషన్ గుర్తిస్తుంది. మెదడులో స్టోర్ అయ్యే మెమరీలన్నీ సినాప్టిక్ పరంజా ప్రోటీన్ ఆకారంలో కనిపిస్తాయి. 0, 1 అనే రెండు స్టేబుల్ బైనరీ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది.

how memories stored in the brain, reveals New Theory

బైనరీ ఫార్మాట్ లో మెమరీ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. కంప్యూటర్ లో సేవ్ హిస్టరీ ఫంక్షన్ మాదిరిగానే మెదడులోనూ ఈ తరహా ఫంక్షన్ పనిచేస్తుంటుంది. సైటోస్కెలిటన్ కణాల ద్వారా చిన్నపాటి మార్పులతో బైనరీ ఫార్మాట్ రూపంలో సమాచారం స్టోర్ అవుతుంది. మెదడులో సినాప్సే మధ్య ట్రిలియన్ల కొద్ది న్యూరాన్లు ఎలక్ట్రో కెమికల్ సిగ్నలింగ్ అందిస్తుంటాయి. ఈ మెకానికల్ కోడింగ్ నిరంతరం ప్రతి న్యూరాన్ తో కలిసి పనిచేస్తూ అన్ని కణాలకు విస్తరించేలా చేస్తుంది. చార్లెస్ బాబేజ్ ఎనలిటికల్ ఇంజిన్ ప్రారంభ మెకానికల్ కంప్యూటర్లను ఈ థియరీ పోలి ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు.