Prevent Respiratory Problems : శ్వాసకోశ సమస్యలు నిద్రకు భంగం కలిగిస్తుంటే నివారణకు సహజ చిట్కాలు !

ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడానికి శ్వాస వ్యాయామాలు బాగా ఉపకరిస్తాయి. ముక్కలతో గాలి పీల్చి నోటి ద్వారా వదలటం వంటివి యోగా నిపుణులను సంప్రదించి రోజువారిగా చేయటం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

Prevent Respiratory Problems : శ్వాసకోశ సమస్యలు నిద్రకు భంగం కలిగిస్తుంటే నివారణకు సహజ చిట్కాలు !

respiratory problems

Prevent Respiratory Problems : గురక, ఆస్తమా ఉన్నవారిలో చాలా మందికి రాత్రిపూట నిద్రపట్టక మేల్కొనే ఉంటారు. రాత్రంతా నిద్రకు అంతరాయం కలగటం వల్ల పగలు సమయంలో రోజువారి కార్యకలాపాలు నిర్వర్తించటం కష్టతరంగా ఉంటుంది. అలసటకు దారితీస్తుంది. దగ్గు, శ్వాస ఆడకపోవడం, ముక్కులు బిగుసుకుపోయి ఊపిరి ఆడకపోవటం, గుండెల్లో మంట, నిద్రలో ఊపిరి పీల్చుకోవడం కోసం హఠాత్తుగా మెలుకువరావటం వంటివి  రాత్రి నిద్రలేమికి దారితీస్తాయి.

READ ALSO : Drinking Alcohol : ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తున్నారా ? అయితే మీ ఆరోగ్యం మరింత డేంజర్ లో పడ్డట్టే !

శ్వాస సంబంధిత సమస్యలు నిద్రకు తీవ్ర అంతరాయం కలిగిస్తాయి, దీనివల్ల మొత్తం శరీరంపై ప్రభావం పడుతుంది. గురక, స్లీప్ అప్నియా, దీర్ఘకాలిక దగ్గు వంటివి ప్రశాంతమైన నిద్రను ఆస్వాదించేందుకు వీలు లేకుండా చేస్తాయి. గాలి ప్రవాహానికి ఆటంకం కలిగించే గురక , పక్కన నిద్రించే వారి నిద్రకు భంగం కలిగిస్తుంది. బిగ్గరగా గురక పెట్టడం ద్వారా, నిద్రకు అంతరాయం కలిగించడమే కాకుండా రక్తపోటు మరియు గుండె జబ్బుల వంటి ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

శ్వాసకోశ సమస్యలను తగ్గించుకోవటంలో జీవనశైలి మార్పులు, శ్వాస పద్ధతులు, మూలిక నివారణలు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సూచనలు, సలహాలు , చికిత్సలను అనుసరిస్తూనే సహాజ సిద్ధమైన చిట్కాలను అనుసరించటం ద్వారా శ్వాసకోశ సమస్యల నుండి కొంతమేర ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

READ ALSO : Hair Health : వర్షకాలంలో జుట్టు ఆరోగ్యం కోసం పెరుగుతో ఇలా చేసి చూడండి !

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినటం : పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

తగినంత నీరు తాగటం : శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరిపడ నీరు తాగాలి. ఇలా చేయటం వల్ల శ్వాస సమస్యల నుండి కొంత మేర ఉపశమనం పొందవచ్చు.

READ ALSO : Reproductive Health : పురుషులు పునరుత్పత్తి ఆరోగ్యం గురించి తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వాస్తవాలు !

రోజువారి వ్యాయామం: ఊపిరితిత్తుల సామర్థ్యం,మొత్తం శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి శారీరక శ్రమ అవసరం. వేగంగా నడక, యోగా, ఈత వంటి రోజువారి కార్యకలాపాలు ప్రయోజనకరంగా ఉంటాయి.

శ్వాస వ్యాయామాలు: ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడానికి శ్వాస వ్యాయామాలు బాగా ఉపకరిస్తాయి. ముక్కలతో గాలి పీల్చి నోటి ద్వారా వదలటం వంటివి యోగా నిపుణులను సంప్రదించి రోజువారిగా చేయటం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

READ ALSO : Dental Health : దంత ఆరోగ్యం విషయంలో చాలా మందిలో నెలకొన్న అపోహలు Vs వాస్తవాలు !

ఆవిరి పీల్చడం: వేడి నీటిని మరిగించి దానిని నుండి వచ్చే ఆవిరిలో యూకలిప్టస్, పసుపు వంటి మూలికలను వేసి పీల్చటం ద్వారా మూసుకుపోయిన ముక్కులకు ఉపశమనం కలిగేలా చేయవచ్చు.

హెర్బల్ టీలు: అల్లం, తులసి వంటి కొన్ని హెర్బల్ టీలు శ్వాసకోశ వ్యవస్థకు మేలు చేస్తాయి. సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. రోజువారిగా ఈ టీలను సేవించటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

పొగ , కాలుష్య కారకాలను నివారించటం: సిగరెట్ పొగ, కాలుష్య కారకాలు శ్వాసకోశ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. వాటికి దూరంగా ఉండటం మంచిది.

READ ALSO : Meal Maker : చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచే మీల్ మేకర్ !

ఈ సమస్యలను సహజ సిద్ధమైన ఆరోగ్యకరమైన జీవనశైలి పద్ధతులను అవలంబించడం. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన బరువును కలిగి ఉండటం ద్వారా శ్వాసకోశ సమస్యల తీవ్రతను తగ్గించుకోవచ్చు. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండటం చాలా అవసరం, ఎందుకంటే ఈ అలవాట్లు శ్వాసకోశ సమస్యలను తీవ్రతరం చేస్తాయి. ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడం ద్వారా నిద్రను మరింత మెరుగుపరుచుకోవచ్చు. శ్వాసకోశ సమస్యలను సహజంగా పరిష్కరించడం ద్వారా మొత్తం ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.