Bad food Combinations : పెరుగుతో కలిపి తినకూడని ఆహారాలు ఇవే !

పాలు మరియు పెరుగులో ప్రోటీన్ చ కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, ఈ రెండింటిని కలపడం వల్ల అసిడిటీ, ఉబ్బరం మరియు గుండెల్లో మంట వస్తుంది. వీటిని కలిపి తింటే, విరేచనాలు, ఆమ్లత్వం, ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను ప్రేరేపిస్తాయి. ఎందుకంటే పాలు అరుగుదల తక్కువగా ఉంటాయి, అయితే పెరుగు తేలికగా , సులభంగా జీర్ణమవుతుంది.

Bad food Combinations : పెరుగుతో కలిపి తినకూడని ఆహారాలు ఇవే !

Bad food Combinations

Bad food Combinations : పెరుగును కొన్ని ఆహారాలతో కలపి తీసుకోవటం ఆరోగ్యానికి ప్రమాదకరం. అనేక విధాలుగా ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబ్టటి కొన్ని ఫుడ్స్ తో కలపి పెరుగు తినటం మానేయాలి. ముఖ్యంగా చెడు ఆహార కలయిక మన ఆరోగ్యంపై తీవ్రప్రభావాన్ని చూపిస్తాయి. పెరుగు అనేది పాలను పులియబెట్టడం ద్వారా తయారు చేయబడిన పాల ఉత్పత్తి. వేలాది సంవత్సరాలుగా, ఈ పులియబెట్టిన ఆహారం అనేక సంస్కృతులలో ప్రధానమైనదిగా, బహుళ ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిందిగా గుర్తుంపు తెచ్చుకుంది.

చాలా మంది ఎండాకాలం తాజా పెరుగుతో పాటు అందులో కొన్ని తరిగిన పండ్లు కలిపి తీసుకుంటుంటారు. పెరుగు భారతీయ గృహాలలో ప్రధానమైనది, తీపి లస్సీగా దీనిని తీసుకుంటారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. రైతాగా కూడా దీనిని తీసుకుంటారు.

పెరుగుతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని ఆహార పదార్థాలు ;

1. మామిడితో కలిపి పెరుగు తీసుకుంటే ;

వేసవిలో లభించే ప్రసిద్ధి సీజనల్ ఫ్రూట్ గా మామిడిని చెప్పవచ్చు. ఇందులో విటమిన్లు, మినరల్స్, అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని పెరుగుతో కలిపినప్పుడు, ఇది శరీరంలో జలుబు, వేడి అసమతుల్యతను కలిగిస్తుంది, చర్మ సమస్యలకు , టాక్సిన్స్ ఉత్పత్తికి దారితీస్తుంది. ఎందుకంటే మామిడి పండు వేడిచేసే పండు , పెరుగు శరీరానికి చల్లదనాన్ని ఇచ్చేది. ఇవి రెండు కలిపి తీసుకున్నప్పుడు శరీరంలో అసమతుల్యతను కలిగిస్తాయి. ఇది చర్మంపై దద్దుర్లు, మొటిమలు, ఇతర చర్మ రుగ్మతలకు దారితీస్తుంది.

2. పెరుగుతో పాలు కలిపి తీసుకుంటే ;

పాలు మరియు పెరుగులో ప్రోటీన్ చ కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, ఈ రెండింటిని కలపడం వల్ల అసిడిటీ, ఉబ్బరం మరియు గుండెల్లో మంట వస్తుంది. వీటిని కలిపి తింటే, విరేచనాలు, ఆమ్లత్వం, ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను ప్రేరేపిస్తాయి. ఎందుకంటే పాలు అరుగుదల తక్కువగా ఉంటాయి, అయితే పెరుగు తేలికగా , సులభంగా జీర్ణమవుతుంది.

3. పెరుగు తో కలిపి ఉల్లిపాయ తీసుకుంటే ;

పెరుగు, ఉల్లిపాయలను కలిపి తీసుకుంటే, అవి అలెర్జీలు, గ్యాస్, అసిడిటీ, వాంతులు కలిగిస్తాయి. ఇందుకు కారణం పెరుగు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉండటమే. ఉల్లిపాయ దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఫలితంగా, ఈ రెండు ఆహారాలను కలపడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అయితే చాలామంది అనుకోకుండా పెరుగు , ఉల్లిపాయలను కలిపి తీసుకుంటారు, ముఖ్యంగా వేసవిలో పెరుగు, ఉల్లిపాయలను కలిపి తీసుకుంటారు.

4. ఆయిల్ ఫుడ్స్ తో కలిపి పెరుగు తీసుకుంటే ;

నెయ్యితో, నూనెతో తయారైన పదార్దాలను పెరుగుతో కలిపి తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. ఇలాంటి అలవాటు ఉన్నవారు దానిని మానుకోవటం మంచిది. ఆయిల్ ఫుడ్స్‌పెరుగుతో కలిపి తీసుకున్నప్పుడు జీర్ణక్రియను నెమ్మదింప చేస్తాయి. రోజంతా శరీరం మందంగా ఉంటుంది.