COVID-19 వ్యాక్సిన్లలో అసలేం కలుపుతారు.. ఎంతవరకు సురక్షితం?

COVID-19 వ్యాక్సిన్లలో అసలేం కలుపుతారు.. ఎంతవరకు సురక్షితం?

ప్రపంచమంతా కరోనావైరస్‌తో వణికిపోతుంది. కరోనా మహమ్మారిని నిర్మూలించే కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. అయితే ఇప్పుడు అందరి భయాలు కరోనా వ్యాక్సిన్ పనితీరుపైనే.. ఎంతవరకు సురక్షితం అనే సందేహాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాక్సిన్ తీసుకోవాలంటేనే సంకోచిస్తున్న పరిస్థితి. కరోనా వ్యాక్సిన్ల గురించి అనేక సందేహాలు, పుకార్లు లేకపోలేదు. కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధి, పంపిణీ కోసం బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ గత ఏడాదిలో 420 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చింది.

అదనంగా, రాబోయే 10 ఏళ్లలో ప్రపంచంలోని అత్యంత పేద దేశాలకు పరిశోధన, అభివృద్ధి, వ్యాక్సిన్ల పంపిణీకి నిధులు సమకూర్చడానికి 10 బిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్టు హామీ ఇచ్చింది. వాస్తవంగా కరోనా వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమేనా? అందులో ఎలాంటి ఇంగ్రీడీయంట్స్ ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో కూడా కరోనా వ్యాక్సిన్లపై దుమారం రేపుతోంది.

కరోనా వ్యాక్సిన్లలో సరిగ్గా ఏం కలిపి అభివృద్ధి చేశారో తెలిస్తేనే టీకా వేయించుకుంటామని మొండిగా చెబుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసిన కరోనా వ్యాక్సినల్లో అతి ముఖ్యమైన టీకాల పూర్తి జాబితా మీకోసం అందిస్తున్నాం.. ఇందులో వ్యాక్సిన్లలో ఏయే ఇంగ్రీడియంట్స్ వాడారో పూర్తి వివరణలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

ఫైజర్-బయోంటెక్ వ్యాక్సిన్‌లో ఏముంది? :
ఇది mRNA వ్యాక్సిన్.. అనగా న్యూక్లియోసైడ్-మార్పు చేసిన మెసెంజర్ RNAను కలిగి ఉంటుంది. SARS-CoV-2 వైరల్ స్పైక్ గ్లైకోప్రొటీన్ ఒక భాగాన్ని ఉత్పత్తి చేయమని కణాలను నిర్దేశిస్తుంది. ఈ స్పైక్ ప్రోటీన్ కరోనా సోకకుండా అనారోగ్యానికి గురికాకుండా నివారిస్తుంది. కానీ, కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే రోగనిరోధక వ్యవస్థను పోరాడాలే ప్రేరేపిస్తుంది. కొవ్వు పదార్ధాలతో తయారు చేసిన టీకా జన్యు సంకేతమనే ఒక చిన్న లిపిడ్ నానోపార్టికల్‌లో స్టోర్ అయి ఉంటుంది.

– (4-హైడ్రాక్సీబ్యూటిల్) అజానెడిల్) బిస్ (హెక్సేన్-6,1-డైల్) బిస్ (2-హెక్సిల్డెకానోయేట్),
– 2 – [(పాలిథిలిన్ గ్లైకాల్) -2000] -N, N-డైటెట్రాడెసిలాసెటమైడ్,
– 1,2-డిస్టెరోయిల్-సాంగ్లిసెరో -3-ఫాస్ఫోకోలిన్, కొలెస్ట్రాల్

ఈ కొవ్వు కణాలు 100 నానోమీటర్ల కంటే పెద్దవి ఉండవు. mRNAకు రక్షణగా ఉంటాయి. జన్యు పదార్ధం అవసరమైన కణాలలోకి వెళ్లేందుకు సాయపడుతాయి. వ్యాక్సిన్‌లో సాధారణ టేబుల్ ఉప్పుతో సహా నాలుగు లవణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే?

– పొటాషియం క్లోరైడ్
– మోనోబాసిక్ పొటాషియం ఫాస్ఫేట్
– సోడియం క్లోరైడ్ (టేబుల్ సాల్ట్)
– ప్రాథమిక సోడియం ఫాస్ఫేట్ డైహైడ్రేట్

ఫాస్ఫేట్-బఫర్డ్ సెలైన్ (PBC)గా పిలిచే ఈ లవణాలు టీకా ఆమ్లత్వం మనిషి శరీరానికి దగ్గరగా ఉండేలా పనిచేస్తుంది. అదనంగా, ఫైజర్-బయోఎంటెక్ టీకాలో చక్కెర శాతం ఉంటుంది. క్షీణతను నివారించడానికి సుక్రోజ్ వ్యాక్సిన్ నానోపార్టికల్స్ -100 డిగ్రీల ఫారెన్‌హీట్ (-75 డిగ్రీల సెల్సియస్) అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది.

మోడెర్నా వ్యాక్సిన్‌లో ఏమున్నాయంటే?
మోడెనా కరోనా వ్యాక్సిన్ FDA నుంచి అత్యవసర ఆమోదం పొందిన రెండవది. mRNA వ్యాక్సిన్ కూడా. కరోనావైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేయడానికి ఒక చిన్న జన్యు సంకేతాన్ని ఉపయోగిస్తుంది. అందుకే రెండు వ్యాక్సిన్ల పదార్థాలు పోలికల్లో తేడాలు ఉంటాయి. వైరల్ స్పైక్ ప్రోటీన్ ఉత్పత్తిని సూచించే మెసెంజర్ రిబోన్యూక్లియిక్ ఆమ్లం (mRNA)తో పాటు, మోడెర్నా వ్యాక్సిన్ లిపిడ్లను కలిగి ఉంటుంది. అవేంటంటే?

– SM (స్పింగోమైలిన్) -102,
– పాలిథిలిన్ గ్లైకాల్ (PEG) 2000 డిమిరిస్టోయిల్ గ్లిసరాల్ (DMG),
– 1,2-డిస్టెరోయిల్-ఎస్ఎన్-గ్లిసరో -3-ఫాస్ఫోకోలిన్ (DSPC),
– కొలెస్ట్రాల్

ఇతర ఇంగ్రీడియంట్లలో స్టెబిలైజర్లు ఇవే :
– ట్రోమెథమైన్,
– ట్రోమెథమైన్ హైడ్రోక్లోరైడ్,
– ఎసిటిక్ ఆమ్లం,
– సోడియం అసిటేట్,
– సుక్రోజ్ (చక్కెర)

ఏ వ్యాక్సిన్లు అలెర్జీలకు కారణమంటే?
2021 ప్రారంభంలో విడుదలైన ఒక CDC నివేదిక ప్రకారం.. ఫైజర్-బయోఎంటెక్ నుండి వచ్చిన దాదాపు 2 మిలియన్ వ్యాక్సిన్ మోతాదులలో, తీవ్రమైన అలెర్జీలు 21 కేసులు మాత్రమే. కానీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అది కూడా సగటున ఒక మిలియన్ మోతాదుకు 11.1 అనాఫిలాక్సిస్ (తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య) కేసుల రేటుతో ఉంటుందని సీనియర్ సిడిసి అధికారి ఒకరు తెలిపారు.

ఫ్లూ లేదా మీజిల్స్ వంటి సాధారణ టీకాతో టీకాలు తీసుకున్నాక అనాఫిలాక్సిస్ అలెర్జీ సమస్యలు ఒక మిలియన్‌కు 1.3 కేసులుగా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌కు అలెర్జీల ప్రమాదం చాలా తక్కువని అంటున్నారు. కొంతమందిలో అనాఫిలాక్టిక్ అలెర్జీలు రావడానికి వారిలో ఇతరేతర అనారోగ్య సమస్యలు కారణం కావొచ్చు అంటున్నారు. వ్యాక్సిన్ తీసుకొనేవారికి అలెర్జీ సమస్యలు ఉంటే.. టీకా మొదటి డోస్ తరువాత రెండవ డోస్ తీసుకోకపోవడమే మంచిదని సీడీసీ సూచిస్తోంది.