మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్

టీఆర్ఎస్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. సమయపాలన కచ్చితంగా పాటించాలని సూచించినట్లు సమాచారం. 

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 06:17 AM IST
మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్

టీఆర్ఎస్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. సమయపాలన కచ్చితంగా పాటించాలని సూచించినట్లు సమాచారం. 

టీఆర్ఎస్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. సీఎం ముందుగా వచ్చినా.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆలస్యంగా రావడంపై కేసీఆర్ సీరియస్ కావడంతో వారంతా సైలెంట్ అయిపోయారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ సమావేశానికి ఆలస్యంగా వచ్చారు. వీరితోపాటు పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు సమావేశానికి ఆలస్యంగా వచ్చారు. 

దీంతో సీఎం కేసీఆర్ కొద్ది సేపు ఆగి సమావేశాన్ని ప్రారంభించాల్సివచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేల రాకకోసం సీఎం కేసీఆర్ కొద్దిసేపు ఎదురుచూడటం చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా రావడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయాన్ని ముందుగానే చెప్పినా ఎందుకు ఆలస్యంగా వచ్చారని సీఎం అడిగినట్లు తెలుస్తోంది. సమయపాలన కచ్చితంగా పాటించాలని సూచించినట్లు సమాచారం. 

గురువారం (జనవరి 9, 2020) ప్రగతి భవన్ లో ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ లతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జీలకు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల్లో విజయానికి వ్యూహాలు వివరించనున్నారు. బీ-ఫారాల జారీకి సంబంధించి విధి విధానాలను వివరించనున్నారు. రేపటితో నామినేషన్ల పర్వం ముగియనున్న నేపథ్యంలో కేసీఆర్ మున్సిపల్ అభ్యర్థులకు బీ-ఫామ్స్ ఇవ్వనున్నారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించారు. 

అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లు వేసే సందర్భంగా తీసుకునే జాగ్రత్తలు, ప్రచారం, గెలుపు కోసం అనుసరించాల్సిన ప్రణాళికలపై సీఎం.. నేతలకు వివరించనున్నారు. పోటీ తవ్రంగా ఉండటంతో రెబల్స్ బెడద లేకుండా చూడాలని, టిక్కెట్లు ఆశించిన వారితోపాటు నాయకులందరినీ అభ్యర్థులు సమన్వయం చేసుకోవాలని చెప్పనున్నారు. ఒక్కమున్సిపాలిటీ ఓడినా మంత్రి పదవి ఊడుతుందని నేతలను ఇప్పటికే కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.