తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెర

తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది.

  • Published By: veegamteam ,Published On : January 19, 2019 / 12:37 PM IST
తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెర

తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. మైకులు మూగబోయాయి. ర్యాలీలు, సభలు, సమావేశాలు బంద్ అయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారాన్ని నిషేధించడంతోపాటు ఫలితాలు వెలువడే వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. 

జనవరి 21 వ తేదీ తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాలు వెల్లడించనున్నారు. 

తొలి విడతలో 4,479 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే 769 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. తొలి విడత ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జనవరి 25న రెండో విడత పంచాయతీ ఎన్నికలు, జనవరి 30న మూడో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం మూడు విడతలలో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి.