తెలంగాణలో తొలి కరోనా బాధితుడికి, గాంధీ ఆసుపత్రి డాక్టర్లు చేసిన చికిత్స, ఇచ్చిన మెడిసిన్ ఇదే

కరోనా వైరస్, యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 2019, డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసింది. చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచం మీద

  • Published By: veegamteam ,Published On : March 22, 2020 / 03:17 AM IST
తెలంగాణలో తొలి కరోనా బాధితుడికి, గాంధీ ఆసుపత్రి డాక్టర్లు చేసిన చికిత్స, ఇచ్చిన మెడిసిన్ ఇదే

కరోనా వైరస్, యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 2019, డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసింది. చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచం మీద

కరోనా వైరస్, యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 2019, డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసింది. చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచం మీద పడింది. యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. 180 దేశాలకు కరోనా వ్యాపించింది. 3లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 13వేల మంది చనిపోయారు. నెలలు గడుస్తున్నా ఇంతవరకు కరోనా మహమ్మారికి ఇంకా కచ్చితమైన వ్యాక్సిన్ కానీ మందు కానీ కనిపెట్టలేకపోయారు. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

కరోనా బాధితులకు ఏ మెడిసిన్ వాడుతున్నారు, ఎలాంటి వైద్యం అందిస్తున్నారు:
కరోనా వైరస్ నివారణకు ఇప్పటివరకూ కచ్చితమైన వ్యాక్సిన్ అందుబాటులో లేని నేపథ్యంలో దేశంలో కొవిడ్-19 బాధితులకు చికిత్స విధానంపై పెద్ద చర్చే నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడ్డవారిలో చాలామంది కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా బారిన పడ్డ కొందరు పలువురు కోలుకున్నారు. రాష్ట్రంలో తొలి బాధితుడు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స తర్వాత పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లాడు. ప్రస్తుతం మరో 21 మంది చికిత్స పొందుతున్నారు. వీరందరికీ ఏ మెడిసిన్ వాడుతున్నారు? ఏ తరహా వైద్యం అందిస్తున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది.

కరోనా చికిత్సకు యాంటీ మలేరియా డ్రగ్ క్లోరోక్విన్ వినియోగం:
అమెరికా విషయానికి వస్తే కరోనా బాధితులకు యాంటీ మలేరియా డ్రగ్ క్లోరోక్విన్ తదితర మందులను ఇస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ పరిస్థితిలో చైనా, అమెరికా, ఇతర దేశాలు అనుసరిస్తున్న చికిత్స విధానాలనే మన దగ్గరా వినియోగంలోకి తెచ్చారు. రాష్ట్రంలో తొలి కరోనా వైరస్ బాధితుడికి నయం చేయడంలో క్లోరోక్విన్ మెడిసిన్ వినియోగించినట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కరోనా బారిన పడ్డట్టు మార్చి 3న గుర్తించారు. 

కరోనా బాధితులకు మలేరియా, ఎయిడ్స్, ఎబోలా, రుమటాయిడ్, ఆర్థరైటిస్ ఔషధాలు:
ఇలా రాష్ట్రంలోకి ప్రవేశించిన వ్యాధికి చికిత్స అందించడాన్ని గాంధీ వైద్యులు సవాల్ గా తీసుకుని కృషి చేశారు. వివిధ దేశాల్లో కరోనా బాధితులకు మలేరియా, ఎయిడ్స్, ఎబోలా, రుమటాయిడ్, ఆర్థరైటిస్ ఔషధాలను ఇచ్చి నయం చేసేందుకు యత్నిస్తుండడంతో గాంధీ వైద్యులూ అదే దారిలో చికిత్స ప్రారంభించారు. తొలుత జనరల్ ఫిజిషియన్, పల్మనాలజిస్టు, జనరల్ మెడిసిన్, సైకాలజిస్టుతో కూడిన వైద్య బృందం రంగంలోకి దిగింది. బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చింది. ఆసుపత్రిలో చేరే నాటికే న్యూమోనియా, జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులతో అతను బాధపడుతున్నట్లు గుర్తించి వాటిని నియంత్రించడానికి చికిత్స ప్రారంభించింది. 

క్లోరోక్విన్ తోపాటు హెచ్ఐవీ, ఎబోలా రోగులకు ఇచ్చే లువినవీర్, రెమిడిసివీర్ ఔషధాల వినియోగం:
ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో ఆక్సిజన్ అందిస్తూనే గంట గంటకు అతని ఆరోగ్యాన్ని పరిశీలించారు. రక్తపోటును నియంత్రిస్తూ ఫ్లూయిడ్స్ అందించారు. క్లోరోక్విన్(chloroquine-anti malarial drug) తోపాటు హెచ్ఐవీ, ఎబోలా రోగులకు ఇచ్చే లువినవీర్, రెమిడిసివీర్(Drug Remdesivir) ఔషధాలను కొనసాగించామని డాక్టర్ శ్రావణ్ తెలిపారు. బాధితుడు మానసిక ఆందోళకు గురి కాకుండా రోజు సైకాలజిస్ట్ తో కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. దీంతో క్రమంగా జ్వరం తగ్గడంతోపాటు న్యూమోనియా నియంత్రణలోకి వచ్చింది. 8వ రోజు మరోసారి పరీక్షలు చేయడంతో కరోనా వైరస్ లేనట్లు తేలింది. రెండు రోజుల తర్వాత మళ్లీ నిర్వహించిన పరీక్షల్లో కరోనా లేదని స్పష్టమైంది. సంపూర్ణ ఆరోగ్యం చేకూరడంతో మార్చి 14న యువకుడిని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారు. ప్రస్తుతం అతడు ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో(సెల్ఫ్ క్వారంటైన్) ఉన్నాడు. అతడి కుటుంబ సభ్యుల్లో ఎవరిలోనూ కరోనా లక్షణాలు బయట పడలేదని డాక్టర్లు తెలిపారు. ఆ విధంగా తెలంగాణలో తొలి కరోనా బాధితుడికి మెడిసిన్, చికిత్స అందించామని గాంధీ ఆసుపత్ర డాక్టర్లు వివరించారు.