Hyderabad Metro record: గణేశ్‌ నిమజ్జనం ఎఫెక్ట్.. హైదరాబాద్ మెట్రో రైళ్లకు రికార్డు స్థాయిలో ప్రయాణికుల తాకిడి

నిన్న ఒక్క రోజే 4 లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రో రైల్‌ అధికారులు తెలిపారు. అత్యధికంగా మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్‌లో దాదాపు 2.46 లక్షల మంది ప్రయాణించినట్లు వెల్లడించారు. నాగోల్-రాయదుర్గం కారిడార్‌లో దాదాపు 1.49 లక్షల మంది, జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్‌లో 22 వేల మంది మెట్రో సేవలను వినియోగించుకున్నట్లు తెలిపారు. స్టేషన్ల విషయానికి వస్తే ఖైరతాబాద్ స్టేషన్‌లో దాదాపు 22,000 మంది మెట్రో రైళ్లు ఎక్కారు. అలాగే, ఆ స్టేషన్ లో 40 వేల మంది రైళ్లు దిగారు. 

Hyderabad Metro record: గణేశ్‌ నిమజ్జనం ఎఫెక్ట్.. హైదరాబాద్ మెట్రో రైళ్లకు రికార్డు స్థాయిలో ప్రయాణికుల తాకిడి

Hyderabad Metro record

Hyderabad Metro record: హైదరాబాద్ లో గణేశ్​ నిమజ్జనం సందర్భంగా నిన్న హైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ బాగా పెరిగింది. నిన్న గణేశ నిమజ్జనాలను చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున ట్యాక్ బండ్ పరిసర ప్రాంతాలకు వెళ్లడంతో రోడ్లపై రద్దీ పెరిగిన విషయం తెలిసిందే. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో ప్రయాణికులు చాలా మంది మెట్రో రైళ్లలో వెళ్ళడానికి ఆసక్తి కనబర్చారు.

రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్​ మెట్రో రైళ్లను నిన్న అర్ధరాత్రి దాటాక రెండు గంటల వరకు నడిపారు. దీంతో నిన్న మెట్రోలో రికార్డు స్థాయిలో ప్రజలు ప్రయాణించారు. నిన్న ఒక్క రోజే 4 లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రో రైల్‌ అధికారులు తెలిపారు. అత్యధికంగా మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్‌లో దాదాపు 2.46 లక్షల మంది ప్రయాణించినట్లు వెల్లడించారు.

నాగోల్-రాయదుర్గం కారిడార్‌లో దాదాపు 1.49 లక్షల మంది, జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్‌లో 22 వేల మంది మెట్రో సేవలను వినియోగించుకున్నట్లు తెలిపారు. స్టేషన్ల విషయానికి వస్తే ఖైరతాబాద్ స్టేషన్‌లో దాదాపు 22,000 మంది మెట్రో రైళ్లు ఎక్కారు. అలాగే, ఆ స్టేషన్ లో 40 వేల మంది రైళ్లు దిగారు.

TTD Eo Dharma Reddy: భక్తులకు ఇబ్బందులు రానివ్వం.. అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం ..