TTD Eo Dharma Reddy: భక్తులకు ఇబ్బందులు రానివ్వం.. అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం ..

అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, భక్తులందరికీ సంతృప్తి‌కరంగా వాహన సేవల దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏ.వి. ధర్మారెడ్డి అన్నారు. శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీటీడీ చేపట్టిన పలు కార్యక్రమాల గురించి భక్తులకు వివరించారు.

TTD Eo Dharma Reddy: భక్తులకు ఇబ్బందులు రానివ్వం.. అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం ..

ttd eo dharma reddy

TTD Eo Dharma Reddy: అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, భక్తులందరికీ సంతృప్తి‌కరంగా వాహన సేవల దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏ.వి. ధర్మారెడ్డి అన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం‌లో  ఆయన మాట్లాడారు. టీటీడీ చేపట్టిన పలు కార్యక్రమాల గురించి భక్తులకు వివరించారు. కోవిడ్ వల్ల రెండేళ్ళుగా నాలుగు మాడ వీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించలేక పోయామని తెలిపారు. అయితే, సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వ తేదీదాకా నాలుగు మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. నాలుగు మాడ వీధుల్లో ఉండే ప్రతిభక్తుడికి సంతృప్తి కరంగా వాహన సేవల దర్శనం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తామని తెలిపాడు.

TTD: గొడుగుల ఊరేగింపులో కానుకలు ఇవ్వొద్దు.. భక్తులకు టీటీడీ సూచన

సెప్టెంబరు 27 నుండి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 20న ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య సంప్రదాయబద్ధంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహి‌స్తామని ,సెప్టెంబర్‌ 26న రాత్రి 7 నుండి 8 గంటల మధ్య అంకురార్పణ జరుగుతుందని, సెప్టెంబరు 27న మొదటి రోజు సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల వరకు మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం నిర్వహిస్తామన్నారు. ధ్వజారోహణం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామివారి వాహన సేవలు జరుగుతాయని, అయితే గరుడ వాహనం రాత్రి 7 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు నిర్వహిస్తామని ధర్మారెడ్డి చెప్పారు.

TTD Caution Deposit Money : కాష‌న్ డిపాజిట్‌‌ డబ్బులపై టీటీడీ కీలక ప్రకటన.. అవాస్త‌వాల‌ను న‌మ్మొద్దని భక్తులకు విజ్ఞప్తి

అక్టోబర్‌ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 గంటలకు చక్రస్నానం, అదేవిధంగా రాత్రి 9 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తామన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని టీటీడీ నిర్ణయించిందని ఈవో చెప్పారు. గదులకు సంబంధించి 50శాతం ఆన్‌లైన్‌లో భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచామని అన్నారు. తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తిరుపతిలోనే గదులు పొంది బస చేయాలని విజ్ఞప్తి చేశారు. సాధారణ రోజుల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుండి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదవితరణ ఉంటుందని, బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుండి రాత్రి 11.30 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.

Thirumala : రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న 89వేల 318 భక్తులు..కరోనా లాక్డౌన్ అనంతరం తొలిసారి

గరుడసేవ నాడు రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. వాహనసేవల ముందు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి అపురూపమైన కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నామని, అదేవిధంగా, తిరుమల ఆస్థానమండపం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సనాతన హిందూ ధర్మ వ్యాప్తిలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార ప్రాంతాల్లో శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో సమరసత సేవా ఫౌండేషన్‌ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1342 ఆలయాల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామని, మొదటి దశలో 502 ఆలయాల నిర్మాణం పూర్తయిందని, ఇక్కడ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామని ఈవో తెలిపారు. రెండో దశలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో రూ.10 లక్షల వ్యయంతో 111 ఆలయాలను నిర్మిస్తున్నామన్నారు.

Tirumala Tirupati: రెండేళ్ల తర్వాత.. భక్తుల సమక్షంలో వేంకన్న బ్రహ్మోత్సవాలు.. శ్రీవారి వాహనసేవల వేళలు విడుదల

ఆగస్టు 16 నుండి 20వ తేదీ వరకు నెల్లూరులో వైభవోత్సవాలు నిర్వహించామని, అక్టోబరు 11 నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్‌ స్టేడియంలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తామని, భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి సేవలను తిలకించి ఆశీస్సులు పొందాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా చిన్నపిల్లలకు వచ్చే అనేక వ్యాధులకు ఉచితంగా శస్త్రచికిత్సలు, వైద్యసేవలు అందించడం కోసం భక్తుల విరాళాలతో శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి త్వరలో నిర్మాణం కానుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న చిన్నపిల్లల ఆసుపత్రిలో ఇప్పటివరకు 652 గుండె శస్త్రచికిత్సలు నిర్వహించి పేద పిల్లల ప్రాణాలు కాపాడామని, శ్రీవారి దయతో సుదూర ప్రాంతమైన బంగ్లాదేశ్‌ వంటి దేశాల నుండి తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొచ్చి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించుకుని వెళ్లారని అన్నారు.