Thirumala : రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న 89వేల 318 భక్తులు..కరోనా లాక్డౌన్ అనంతరం తొలిసారి
తిరుమల కొండ కిక్కిరిసింది. ఓ వైపు పిల్లలకు వేసవి సెలవులు.. మరోవైపు వీకెండ్ కావడంతో తిరుమల భక్తజన సంద్రమైంది. భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగిపోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్‌లు నిండిపోయి బయట కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు.

thirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తు జనం పోటెత్తారు. కరోనా లాక్డౌన్ అనంతరం మొదటిసారిగా రికార్డు స్థాయిలో 89,318 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనేవుంది. సర్వదర్శనం కోసం 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 నుండి 20 గంటల సమయం పడుతుంది. నిన్న 89,318 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.76 కోట్లు.
తిరుమల కొండ కిక్కిరిసింది. ఓ వైపు పిల్లలకు వేసవి సెలవులు.. మరోవైపు వీకెండ్ కావడంతో తిరుమల భక్తజన సంద్రమైంది. భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగిపోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్‌లు నిండిపోయి బయట కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం పండుతోంది. ప్రతిగంటకు 8వేల మంది భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశిస్తున్నారు. అయితే గంటకు 4 వేల మందికి మాత్రమే వెంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం కలుగుతుంది. అంతుకు మించి భక్తులకు దర్శనం కల్పించలేమని టీటీడీ తెలిపింది.
వైకుంఠ ఏకాదశి, గరుడ సువ రోజులకన్నా భక్తులు తిరుమలకు పోటెత్తారు. ఒక్కసారిగా భక్తులు పెరిగిపోవడంతో టీటీడీ సైతం ఉక్కిరిబిక్కిరయింది. మూడు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మరో నాలుగు రోజుల పాటు రద్దీ ఉంటుందని.. భక్తులు తిరుమలకు రావొద్దని టీటీడీ ఈవో ధర్మారెడ్డి సూచించారు. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని.. బ్రేక్ దర్శనాలకు వచ్చే భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని టీటీడీ సూచించింది.
మరోవైపు క్యూలైన్లలో మహిళలు, చిన్నారులు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాట లాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. క్యూలైన్లను పరిశీలించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. వైకుంఠం కాంప్లెక్స్ వెలుపల ఉన్నవారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
- PM Modi : ఈనెల 23, 24న ప్రధాని మోదీ జపాన్ పర్యటన
- Sun Rare Images : సూర్యుడి అరుదైన చిత్రాలు..తొలిసారిగా కెమెరాకు చిక్కాయి
- Madras High Court : దేశ చరిత్రలోనే తొలిసారి-వాట్సప్ ద్వారా కేసు విచారించిన న్యాయమూర్తి
- PM Modi : నేడు ప్రధాని మోదీ నేపాల్ పర్యటన..ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు
- Rahul OU Tour : ఓయూలో రాహుల్ పర్యటనపై రిజిస్ట్రార్ లేఖ..అనుమతి నిరాకరణకు కారణాలు వెల్లడి
1Minister KTR : యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
2Rakhi Sawant : నేనెలాంటి బట్టలు వేసుకోవాలో నా ప్రియుడే డిసైడ్ చేస్తాడు..
3Ammavodi: వరుసగా మూడో ఏడాది అమ్మఒడి అందుకుంటున్న శ్రీకాకుళం
4Yashwant Sinha : నేడే యశ్వంత్ సిన్హా నామినేషన్
5Rains In Telangana: తెలంగాణలో మోస్తరు వర్షాలు
6Intermediate Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
7Jack Sparrow : జానీడెప్ కి సారీ చెప్పి 2300 కోట్ల డీల్‌ని ఆఫర్ చేసిన డిస్ని??
8Hallmark: పాత గోల్డ్‌కు కొత్త హాల్ మార్క్
9Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..
10Chiranjeevi : ఆయన నా సీనియర్.. ఆయనతో సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు..
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్‌ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?