కాచిగూడ రైలు ప్రమాద ఘటన : లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతి

కాచిగూడ రైలు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఎంఎంటీఎస్​లోకో పైలట్ చంద్రశేఖర్ మృతి చెందాడు. చంద్రశేఖర్‌ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

  • Edited By: veegamteam , November 17, 2019 / 01:47 AM IST
కాచిగూడ రైలు ప్రమాద ఘటన : లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతి

కాచిగూడ రైలు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఎంఎంటీఎస్​లోకో పైలట్ చంద్రశేఖర్ మృతి చెందాడు. చంద్రశేఖర్‌ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

కాచిగూడ రైలు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఎంఎంటీఎస్​లోకో పైలట్ చంద్రశేఖర్ మృతి చెందాడు. నాంపల్లి కేర్ ఆస్పత్రిలో ఆరు రోజులుగా చికిత్స పొందుతున్నాడు చంద్రశేఖర్‌. పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి 10 గంటలకు ఆయన చనిపోయినట్లు కేర్ ఆస్పత్రి వైద్యులు నిర్దారించారు. చంద్రశేఖర్‌ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

హైదరాబాద్ కాచిగూడలో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ MMTS లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతి చెందాడు. 11వ తేదీ ఉదయం పదిగంటల 45 నిమిషాల సమయంలో.. కర్నూలు నుంచి కాచిగూడ స్టేషన్‌లోకి వస్తున్న హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను.. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్‌ రైలు వేగంగా ఢీకొట్టింది. దీంతో.. ఎంఎంటీఎస్ క్యాబిన్.. హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌లోకి చొచ్చుకుపోయింది. వెనక ఉన్న ఆరు బోగీలు ధ్వంసమయ్యాయి. 3 బోగీలు.. పట్టాలు తప్పి పక్కకు ఒరిగిపోయాయి. ఈ ప్రమాదంలో.. ఎంఎంటీఎస్ రైలు లోకో పైలట్ చంద్రశేఖర్.. క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. తనను బయటకు తీయాలని గట్టిగా అరిచాడు. అతనిని తీసేందుకు.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. 

అప్పటివరకు.. రెండు రైళ్ల ఇంజిన్ల మధ్య చిక్కుకున్న చంద్రశేఖర్.. నరకయాతన అనుభవించాడు. ఓ వైపు.. ప్రత్యేక పద్ధతుల్లో.. చంద్రశేఖర్‌కు ఆక్సిజన్ అందిస్తూనే.. మరోవైపు గ్యాస్ కట్టర్లతో.. ఎంఎంటీస్ క్యాబిన్‌ను కొంచెం.. కొంచెం తొలగిస్తూ వచ్చారు. అతను సేఫ్‌గా బయటపడే వరకు అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. తీవ్రగాయాలతో బయటపడ్డ చంద్రశేఖర్‌ను నాంపల్లి కేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే.. 8 గంటల పాటు ఇంజన్‌లో నలిగిపోవడంతో ఆయన పక్కటెముకలు విరిగిపోయాయి. కిడ్నీలు రెండూ పాడయ్యాయి. కుడికాలులో రక్తప్రసరణ నిలిచిపోయింది. కిడ్నీ, గుండెకు ఇన్‌ఫెక్షన్‌ చేరే ప్రమాదం ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో కుడి మోకాలి పైభాగం వరకు కాలును తొలగించారు. ఆయనను బతికించేందుకు డాక్టర్లు తీవ్రంగా కృషి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. 

ఇంజన్‌లో నుంచి బయటకు తీసుకురాగానే చంద్రశేఖర్‌కు గుండెపోటు కూడా వచ్చింది. కేర్ ఆస్పత్రిలో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయినా ఫలితం దక్కలేదు. ఆరురోజులుపాటు మృత్యువుతో పోరాడిన చంద్రశేఖర్‌ కన్నుమూశాడు. చంద్రశేఖర్‌ మృతదేహాన్ని..కాచిగూడ రైల్వే పోలీసులకు అప్పగించారు కేర్‌ ఆస్పత్రి వైద్యులు. అనంతరం ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు రైల్వే పోలీసులు. ఇవాళ ఉస్మానియాలో చంద్రశేఖర్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.